కోస్గి, జూన్ 24: ఒక ఊళ్లో సోషల్ మీడియాలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య రేగిన వివాదం మధ్యలోకి ఎస్సై తలదూర్చాడు. స్టేషన్‌కి పిలిచి ఒకరిని కొట్టడం తో వివాదం ముదిరి చివరకు స్టేషన్లో ధర్నా చేసే వరకు వచ్చింది. వివరాలిలా..
సయ్యద్ వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. నారాయణపేట జిల్లా కోస్గి మండలం ముశ్రీఫా గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి డైలాగ్‌తో ఉన్న ఓ వీడియో ను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు.
దీం తో అదే గ్రామంలోని మరో వర్గం కాంగ్రెస్ నా యకులు తమనుద్దేశించే ఈ వీడియో స్టేటస్ పెట్టాడని అతడితో గొడవకు ది గారు. దీంతో పంచాయితీ కా స్తా చివరకు పోలీస్ స్టేషన్ మె ట్లు ఎక్కింది. ఇక్కడే ఎస్సై బాలరాజు తన తెలివి ప్రదర్శించాడు. బాధితుడు ఆటో డ్రైవర్ కావడం.. అతడి వెనక ఎవరూ లేరన్న సమాచారంతో.. నాయకుల మెప్పుకోసం అతడిని స్టేషన్‌కు పిలిచాడు. కానీ అప్పటికే ఫి ర్యాదు చేయడానికి వచ్చిన సయ్యద్‌ను లోపలికి పిలిచి మరోవర్గం నా యకుల ఎదుటే అతడిపై చేయి చేసుకున్నట్లు తెలిసింది.
‘చిలికిచిలికి గాలివానలా’ ఈ ఘటన కాస్తా పెద్దదైంది. అయినా బాధితుడి బంధువులను సైతం తీసుకురావాలని ఎస్సై బాలరాజు సిబ్బందిని పంపించారు. దీంతో ఆ గ్రహించిన వారు ఎస్సైపై చర్య లు తీసుకోవాలని భీష్మించుకూర్చున్నారు. ఈ విషయమై ‘నమస్తే తెలంగాణ’ విలేకరి అక్కడకు వెళ్లి వివరాలు తెలుసుకుంటుండగా.. ఎస్సై బయటకు వచ్చి వీడియో తీయరాదంటూ చిందులు తొక్కారు. బాధితులు కూడా ప్రశ్నించడంతో అక్కడి నుం చి మెల్లగా జారుకున్నారు.
ఇంత జరిగినా ఏమాత్రం తగ్గకుండా ‘ఎవరికైనా చెప్పుకోం డి.. నన్ను ఎవరూ ఏమీ పీకడు.. బొచ్చులోది ఈ పోలీస్ స్టేషన్ కాకపోతే.. మరో స్టేషన్’ అం టూ దురుసుగా వ్యవహరించారు. కాగా స్టేషన్‌కు బాధితుడి తరపున గ్రామస్తులు చేరడంతో పోలీసులు వారికి సర్దిచెప్పారు. అనంతరం ఎ స్సై బాలరాజుపై చర్యలు తీసుకోవాలని సీఐకి ఫిర్యాదు చేశారు. లేకుంటే స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు హెచ్చరించా డు.
అయితే రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక కోస్గి కాంగ్రెస్‌లో వర్గపోరు మొదలైంది. పలువురు నాయకులు సైతం బాహాటంగానే ఒకరిపై ఒక రు విమర్శలు గుప్పించుకుంటున్నారు. కోస్గి ఎస్సైగా బాలరాజు బాధ్యతలు చేపట్టి నాటి నుంచి వివాదాలతో అందరి నోట్లో ఉన్నాడు. అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం వారు చెప్పిందల్లా చేస్తూ ఇతరులకు అన్యాయం చేస్తున్నారనే విమర్శలు మూటగట్టుకున్నారు.