మహబూబ్‌నగర్, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం రేవంత్‌రెడ్డికి జన్మనిచ్చిన కొండారెడ్డిపల్లి కన్నీరు పెడుతున్నది. ఉపాయం లేకుండా చేపట్టిన అభివృద్ధి పనులు గ్రామస్తులకు అపాయాన్ని తెచ్చిపెడుతున్నా యి. సీఎం మెప్పు కోసం అధికారులు తాపత్రయ పడుతున్నారు తప్పా క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జాతీయ రహదారి కొండారెడ్డిపల్లి గేటు నుంచి కొండారెడ్డిపల్లి సరిహద్దుల వ రకు చేపట్టిన నాలుగు లేన్ల రహదారి పనుల నుంచి మో డల్ సోలార్ వరకు చేపట్టిన అభివృద్ధి పనులు నిర్లక్షానికి నిలువుటద్దంగా నిలిచాయనే వార్తలు బాహాటంగా వినిపిస్తున్నాయి. నాలుగులేన్ల్ల రోడ్డు నిర్మాణానికి భూసేకరణ చే యకుండానే పనులు చేపట్టడంతో భూములు కోల్పోయి న రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొత్త మీటర్ల పేరుతో విద్యుత్ సిబ్బంది రూ.లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొండారెడ్డిపల్లి చారిత్రక నేపథ్యం..
నాగర్‌కర్నూల్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డిపల్లికి చారిత్రక నేపథ్యం ఉన్నది. నిజాం ప్రభుత్వం కొండారెడ్డిపల్లిని అత్రాఫ్ బల్ధా(పట్టణ)జిల్లాలో చేర్చింది. సుమతి శతక కర్త బద్దెన కొండారెడ్డిపల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడని స్థానికులు అంటారు. బెబ్బులి యుద్ధానికి రంగినేని వారికి బలగాలను సమకూర్చిన గ్రామం. తెలంగాణ సాయుధ పోరాటానికి వీరుల్ని అం దించిన గ్రామం కొండారెడ్డిపల్లి. ఇంతటి పేరున్న గ్రామం నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో గ్రామస్తులు ఎంతో సంబురపడిపోయారు.
కాంట్రాక్టర్లకు కాసులు కురిపించే పనులు..
కొండారెడ్డిపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులు కాంట్రాక్టర్లకు కాసులు కురిపించేలా ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండారెడ్డిపల్లి గేట్ నుంచి గ్రామంలోకి వేస్తున్న నాలుగులేన్ల రోడ్డు నిర్మాణంలో పలు అవకతవక లు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూసేకరణ లేకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, బెదిరించి రోడ్డు నిర్మాణం చేపట్టారని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
6కిలోమీటర్ల నాలుగు లేన్ల రోడ్డు( 66 ఫీట్లు) నిర్మాణానికి అంచనా వ్యయం రూ.17 కోట్లు. జాతీయ రహదారులను తలదన్నే రీతిలో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఒక్కో చోట రోడ్డు ఎత్తు 10 నుంచి 15 ఫీట్ల వరకు ఎత్తు ఉన్నది. రోడ్డు ఎత్తు పెరగటంతో రైతుల పొలాలు మట్టి కుప్పలయ్యాయి. రైతుల పొలాల కంచెలు విరిగిపోయాయి. దారులు మూసుకుపోయాయి. ఇదేమిటని అగిడితే దిక్కున్న చోట చెప్పుకోమనే సమాధానాలు వస్తున్నాయి. మరీ గట్టిగా అడిగి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే పోలీస్‌స్టేషన్ మెట్టు ఎక్కాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పగిలిన పైపులైన్లు..
రోడ్డు నిర్మాణంతో పైప్లైన్లు పగిలిపోయాయి. పొలాల్లో కంచెలు విరిగిపోయాయి. జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారులు రికార్డుల్లో పొందుపర్చలేదు. పశువులు వెళ్లేందుకు కిలోమీటర్‌కు ఒకటి రెండు చోట్లు బాక్స్ కల్వర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అదేమి చేయలేదు.విషయానికి వస్తే రైతులు తమ పొలాలకు వెళ్లే దారి కరువైంది. పోయి న భూమికి, కంచె పైప్లైన్ల నష్టానికి పరిహారం లేదు సరికదా పొలాలకు వెళ్లేందుకు దారి కరువైందని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
విద్యుదీకరణలో అధికారుల చేతివాటం..
గ్రామంలో చాలా వరకు విద్యుద్దీకరణ జరిగింది. పాత లైన్లు మార్చి కొత్త లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్టర్లకు జరుగుతున్న లబ్ధి ఎక్కువని గ్రామస్తులు అంటున్నారు. పాత లైన్లు మార్చేటప్పుడు చిన్న, చిన్న మార్పులను వినియోగదారులు అడగటం సరిపాటే. దీన్ని అలుసుగా తీసుకుని లేబర్ చార్జీలంటూ రూ.లక్షల్లో వసూ లు చేస్తున్నారు. ఈ అభివృధ్ధి మాటున ఖాజానాకు, వినియోగదారునికి ఇద్దరికీ టోపి పడే పరిస్థితి ఏర్పడింది.
అధికారుల మధ్య లోపించిన సమన్వయం..
రెవెన్యూ, ఆర్అండ్బీ, విద్యుత్, మిషన్ భగీరథ అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో కొత్త కొత్త స మస్యలు తలెత్తుతున్నాయి.గ్రామానికి చెందిన చోటమోట లీడర్లు అభివృధ్ధి పనుల విషయంలో పెత్తనం చెలాయిస్తుండటంతో అధికారులు మిన్నకుండి పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. పేరుకు మాత్రమే అధికారులు రివ్యూ మీటింగ్‌లు ఏర్పాటు చేసినా..ఆశించిన మేర సత్ఫలితాలు ఇవ్వలేదని గ్రామస్తులు అంటున్నారు.విషయం ఎంత వరకు వచ్చిందంటే అధికారులు ఏదైన హామీ ఇస్తే గ్రామస్తులు నమ్మడం లేదు.గ్రామంలో చిల్లర దేవుళ్లు అన్ని విషయాల్లో వేలు పెడుతుండటంతో అధికారులు అభివృధ్ధి కార్యక్రమాలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.
ఆశతో ఎదురుచూపులు..
రోడ్డు విస్తరణలో భూములు కోల్పోవడంతోపాటు పైప్లైన్లు, ఫిన్సింగ్లకు రైతాంగం నష్ట పరిహారానికి ఎదురు చూస్తున్నారు. దసరా తర్వాత సోమవారం కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్న నేపథ్యంలో భూముల నష్ట పరిహారంపై ఏదైనా ప్రకటన చేస్తారా లేదా అని రైతులు ఎదురు చూస్తున్నారు. రూ.కోట్ల విలువైన భూములు రోడ్డు విస్తరణలో కోల్పోయామని, పొలాలకు వెళ్లేందుకు వీలుగా బాక్స్ కల్వర్టులు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.