మరికల్(ధన్వాడ), జనవరి 20 : మండలంలోని చిత్తనూర్‌లో ఎలాంటి అనుమతులు లేకుం డా నిర్మిస్తున్న చిత్తనూర్ ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం మండలంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వివిధ సంఘాల నాయకులు, అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ఇథనాల్ కంపెనీకి జూరాల నుంచి కోయిల్‌సాగర్ కు తరలించే నీటిని అక్రమంగా తరలించేందుకు కాలువల నిర్మాణ పనులు చేస్తున్నారని, అలాగే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడం, నక్ష బాటలు, రైతులకు నష్టం జరుగుతున్న ఇథనాల్ కంపెనీని రద్దు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కంపెనీ నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలు మన్నెవాగులో కలపడం వల్ల ఉమ్మడి జిల్లాకు తా గునీటిని అందించే రామన్‌పాడ్ జలాలు విషంగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న కంపెనీ వారిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి రైతులు అధికసంఖ్యలో తరలివచ్చారు. అంతకుమందు రైతులు ర్యాలీగా వచ్చారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు రాఘవాచారి, లక్ష్మయ్య, చంద్రశేఖర్, వెంకట్‌రెడ్డి, శివకుమార్, ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, లక్ష్మణ్, చక్రవర్తి, సుదర్శన్, వెంకట్రాములు, మురళి, మనీవర్ధన్రెడ్డి, గోపాల్, శ్రీనివా స్, సరోజనమ్మ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.