మహబూబ్నగర్ : కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. జిల్లాలోని దేవరకద్ర మండలం కోయిలసాగర్ జలాశయం శనివారం సాయంత్రం నాటికి 20.6 అడుగుల నీటి నిల్వ ఉందని డీఈ చందు తెలిపారు.
జలాశయంలోకి జూరాల జలాలతోపాటు వర్షపునీరు వచ్చి చేరుతుండటంతో క్రమంగా నీటిమట్టం పెరుగుతోందన్నారు. సాగర్ మొత్తం నీటి సామర్థ్యం 32 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 20. 6 అడుగుల వద్ద నీటితో కళకళలాడుతున్నది.