వెల్దండ, డిసెంబర్ 1 : కేఎల్ఐ డీ-82 క్వాలకు గండీ గండం పట్టుకున్నది. అధి కారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే దా దాపు పదిసార్లు గండి పడింది. మండలం లోని గుండాల-వెల్దండ సమీపంలో కేఎల్ఐ డీ-82 కాల్వకు మళ్లీ గండి పడిం ది. ఆదివారం తెల్లవారుజామున కాల్వ తెగడంతో సాగునీళ్లు వృథాగా పారుతు న్నాయి. ఈ వానకాలం ఆరంభం తర్వాత 10సార్లు కాల్వకు గండి పడిందని స్థాని కులు చెబుతున్నారు.
గండి పూడ్చడంతో నాణ్యత లేక గండి పడ్డ చోటే మళ్లీ కాల్వ తెగిపో తుం దని ఆరోపిస్తున్నారు. అయితే కాల్వ తెగిపోవడంతో సాగునీరు వృథాగా పోతుండడంతో కాల్వకు దిగువనున్న పంటలు మునిగి నష్ట పోయో ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాల్వ కు తరచూ గండ్లు పడకుండా శాశ్వత పరి ష్కారం దిశగా మరమ్మతులు చేపట్టాల ని డిమాండ్ చేశారు.