మూసాపేట, మార్చి 21 : మండలంలోని నిజాలాపూర్ గ్రామానికి కేఎల్ఐ నీళ్లు రాకపోవడంతో పంటలు ఎండుతున్నాయని ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల 13వ తేదీన ‘రైతున్న వరి గోస’ అనే కథనంతో రైతులు పడుతున్న ఇబ్బందులను, కేఎల్ఐ నీళ్లు రాకుంటే సూమారుగా 300 ఎకరాల వరకు వరి పంట ఎండుతుందని తెలియజేస్తూ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం పాఠకులకు విధితమే.
రైతులు కూడా స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిని కలిసి వారి సమస్యను వివరిస్తూ పంటలు ఎండుతున్నాయని, సాగునీరు రాకుంటే ఇబ్బందులు పడుతామని చెప్పడంతో ఎమ్మెల్యేలు స్పందించి సాగునీటిని విడుదల చేయించారు.