మహబూబ్‌నగర్, ఏప్రిల్ 16 : కోయిలకొండలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో అంబేద్కర్ జయంతి రోజు విద్యార్థిని యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆ లస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కేజీబీవీలోనే కొత్తగా నిర్మాణం చేపడుతున్న జూనియర్ కళాశాల భవనంలో కార్మికులు పనులు చేస్తున్నారు. సోమవారం అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఫోన్‌ను కస్తూర్బాలో చార్జింగ్ పెట్టి పనులు చేస్తుండగా, ఫోన్ రావడంతో విద్యార్థిని గుర్తించి వారికి ఇచ్చింది.
ఈ విషయం క్రాఫ్ట్ ఉపాధ్యాయురాలు భీమమ్మ దృష్టికి రా వడంతో బయటి వ్యక్తులతో మాటలేంటని, ప్రవర్తన మార్చుకోవాలని, లేదంటే తల్లిదండ్రులకు చెప్పి టీసీ ఇచ్చి పంపిస్తానని హెచ్చరించారు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని పాఠశాలలో బాత్రూం కడిగే యాసిడ్‌ను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తో టి విద్యార్థులు గుర్తించి చికిత్స కోసం బాలిక ను మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానకు త రలించారు. ఆరోగ్యం కుదుటపడ్డాక బాలిక తల్లిదండ్రులతో ఇంటికి వెళ్లింది. డీఈవో ప్ర వీణ్‌కుమార్ బుధవారం కోయిలకొండ కేజీబీవీకి చేరుకొని విచారణ చేపట్టారు.