మిడ్జిల్, అక్టోబర్ 25: సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టులోని కేసీఆర్ భీమా పథకం ప్రతి ఇంటికీ ధీమాగా మారబోతున్నదని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, ఎంపీపీ సుదర్శన్, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రతిఒక్కరికీ తెలియజేయాలన్నారు. మహిళలకు నెలనెలకు రూ.3వేలు ఇవ్వడంతోపాటు, అన్నపూర్ణ పథకం కిందట రేషన్‌షాపు ద్వారా సన్నబీయ్యం, మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడం, సౌభాగ్యలక్ష్మి పథకం పేద మహిళలకు ఎంతోమేలు చేస్తుందన్నారు. ఆసరా పింఛన్లు రానున్న ఐదేండ్లలో రూ.5వేలు, దివ్యాంగుల ఫింఛన్లు రూ.6 వేలకు పెంపు, వ్యవసాయనికి రైతుబంధు రూ.16వేలకు పెంపు, మహిళలకు గ్యాస్ సిలిండర్ రూ.400కు, అరోగ్యశ్రీ రూ.15లక్షల పెంపు, ఇండ్ల స్థలాలు లేని పేదలకు స్థలాలు, అగ్రవర్ణ పేదలకు రాష్ట్రంలో 119 రెసిడెన్షియల్ స్కూల్స్ వంటి పథకాలతో అన్నివర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు చేయలేని పనులను, సీఎం కేసీఆర్ 9 ఏండ్లలో ఎంతో అభివృద్ధి చేశారు. ప్రజలు పనిచేసే ప్రభుత్వాలకు అండగా ఉండాలని కోరారు. సమావేశంలో పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు జంగిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సుధాబాల్రెడ్డి, శ్రీనివాసులుగుప్తా, శ్యామ్‌సుందర్‌రెడ్డి, సత్యంగుప్తా, జగన్‌గౌడ్, నాగిరెడ్డి, శ్రీనివాసులు, యాదయ్య, శివప్రసాద్, వెంకటయ్య తదితరులు ఉన్నారు.
రాజాపూర్, అక్టోబర్ 25: పేదల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అందించే పన్నెండు గ్యారెంటీలు ప్రజలుకు వివారించాలని మాజీ సంగీత నాటక అకాడమి చైర్మన్ శివకుమార్, జెడ్పీటీసీ మోహన్‌నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందించే పన్నెండు గ్యారెంటీల మ్యానిఫెస్టో వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల నాయకులు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ఇంటింటికీ తిరిగి వివరించాలని తెలిపారు. ప్రతిపక్షాలు ఆరు గ్యారెంటీలని ప్రజలను మోసం చేసేందుకూ తిరుగుతున్నారన్నారు. పేదల కోసం పనిచేసే సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గెలుపు కోసం సమిష్టంగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహులు, ఏఎంసీ డైరెక్టర్ నారాయణరెడ్డి, రమేశ్‌నాయక్, నరహరి, నాగిరిరెడ్డి, అల్తాఫ్, యాదగిరి, ముస్తాఫా, యాదగిరి పాల్గొన్నారు.