అలంపూర్/అయిజ, ఫిబ్రవరి 17 : తెలంగాణ జాతిని జా గృతం చేసి, దశాబ్దాల కల, తెలంగాణ రాష్ట్ర సాధనను సాకా రం చేసిన జాతిపిత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కారణజన్ముడని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సాధకుడు, తొలి సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సో మవారం అలంపూర్ మున్సిపాలిటీతోపాటు అయిజ బాలుర ఉన్నత పాఠశాలలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వృక్షార్చన, యు వజన నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించా రు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ప్రారంభించి, వృక్షార్చనలో మొక్కలు నాటారు. ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు ని ర్వహించారు.
అనంతరం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. తిక్కవీరేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు చేశారు. మొక్క లు నాటారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నేత సంకాపురం రాముడు, మాజీ ఎంపీపీలు సుందర్రాజు, ప్రహ్లాదరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ దేవన్న, మాజీ వైస్ చైర్మన్ న ర్సింహులు, మాజీ జెడ్పీటీసీ చిన్నహన్మంతు, బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య, బీఆర్ఎస్ సీనియర్ నేతలు వావిలాల రంగారెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, రవిరెడ్డి, మాజీ సర్పంచులు తిప్పారెడ్డి, హన్మంతురెడ్డి, భద్రయ్య, మాజీ ఎంపీటీసీలు వేణుగోపాల్‌రెడ్డి, రాముడు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రవిప్రకాశ్, కిశోర్, రామకృష్ణ, సత్యం తదితరులు పాల్గొన్నారు.