అయిజ, నవంబర్ 2 : జోగుళాంబ, బాల బ్ర హ్మేశ్వరస్వామి ఆలయంలో కార్తీక శోభ సంతరించుకున్నది. శనివారం కార్తీకమాసం ప్రారం భం కావడంతో జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామిలకు అభిషేకం, అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అలంపూర్‌కు చేరుకుని తుంగభద్ర నది లో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు ని ర్వహించారు. అనంతరం కార్తీక దీపాలను వెలిగించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్ర త్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో పురందర్కుమా ర్, చైర్మన్ కొంకల నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు.
శ్రీశైలం, నవంబర్ 2 : శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఆరంభమయ్యాయి. తొలిరోజు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో చం ద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రద్దీ రోజుల్లో గర్బాలయ స్పర్శదర్శనాలు నిలిపివేసి అలంకార దర్శనం మాత్రమే క ల్పిస్తుండడంతో భక్తులు సహకరించాలని ఈవో కోరారు. కార్తీక మాసాంతం ప్రతిరోజూ ప్రధాన ధ్వజస్తంభంపై వెలిగించే ఆకాశదీప ప్రజ్వలన కా ర్యక్రమాన్ని శాస్ర్తోక్తంగా ప్రారంభించారు. తెల్లవారుజాము 4:30 నుంచి సాయంత్రం 4వరకు, సాయంత్రం 05:30 నుంచి రాత్రి 11గంటల వ రకు దర్శనాలు కల్పించినట్లు పేర్కొన్నారు. పౌ ర్ణమి ఘడియలు ప్రారంభమైన రోజు పాతాళగం గ వద్ద ఉన్న కృష్ణవేణి నదీమతల్లికి సారె సమర్ప ణ, గంగా హారతి నిర్వహించనున్నట్లు తెలిపారు.