Illegal Projects | కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు పాలమూరుకు మరణ శాసనం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Illegal Projects | కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు మరణ శాసనం కానుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు.
మహబూబ్ నగర్ : కర్ణాటక ( Karnataka ) ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల ( Illegal Projects ) వల్ల తెలంగాణకు మరణ శాసనం కానుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Former Minister Srinivas Goud) ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్డీఎస్‌పై కృష్ణ పరివాహక ప్రాంతంలో ఆయా ప్రాంత రైతులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. తాము మాట్లాడుతున్నది అవాస్తవం కాదని అన్నారు.
తుంగభద్ర ప్రాజెక్టు గేట్ల ఎత్తివేతకు హెలికాప్టర్లో వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అక్రమా ప్రాజెక్టులు కనిపించలేదా అని ప్రశ్నించారు. ఆర్డీఎస్కు వంద మీటర్ల దూరంలోనే కర్ణాటక ప్రభుత్వం లిఫ్ట్ పనులు మొదలు పెట్టిందని, వీటితోపాటు మరో రెండు రోడ్ కమ్ బ్యారేజులు కడుతుందని ఆరోపించారు. చంద్రబాబు గుండ్రేవుల వద్ద 20 టీఎంసీల రిజర్వాయర్‌కు ప్రణాళిక తయారు చేశారని వెల్లడించారు. వీటి వల్ల తుంగభద్ర నీరు శ్రీశైలంకు శాశ్వతంగా రావని వివరించారు.
కృష్ణా పైకూడా అనేక ప్రాజెక్టులు కడుతున్నారని, ఇవన్నీ ఎలాంటి అనుమతులు లేకుండానే జరుగుతున్నాయని వెల్లడించారు. అక్రమ నిర్మాణాలు పూర్తయితే పాలమూరు లో ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఒక్క చుక్క నీరు రాదని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా అక్రమ ప్రాజెక్టుల వద్దకు వెళ్లి చూడాలని కోరారు. జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకించారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టు పనులు నిలిపివేస్తామని అన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

