మహబూబ్నగర్, అక్టోబర్ 20 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : రైతులను నిలువునా మో సం చేస్తూ రేవంత్ సర్కారు రైతుభరోసా ఇవ్వలేమని వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించడం పై ఆదివారం ఉమ్మడి జిల్లాలో ఆందోళనలు పె ల్లుబికాయి. బీఆర్ఎస్ నేతలు, రైతులు, ప్రజాసంఘాలు కాంగ్రెస్ సర్కారు తీరును తప్పుబడుతూ దుమ్మెత్తిపోశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలో పార్టీ శ్రేణు లు పెద్దఎత్తున ధర్నాలు, రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. ఉ దయం 11గంటలకు రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. మండల కేంద్రాల్లో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఎన్నికల సమయంలో రై తుభరోసా కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తామని ప్రకటిం చి అసలుకే ఎసరు పెట్టారని మండిపడ్డారు. యాసంగిలో ఇస్తామన్న రైతుభరోసా ఇప్పటివరకు అడ్రస్ లేకపోగా, వానకాలానికి సంబంధించి ఇక ఇవ్వలేమని మంత్రి ప్రకటన చేయడం సిగ్గుచేటన్నారు. రైతులను మోసం చేసిన సీ ఎం రేవంత్రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతుభరోసా ఇవ్వకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రైతుభరోసా ఇవ్వలేమని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమానికి రైతులు కదిలొచ్చారు. రేవంత్రెడ్డి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలో పాల్గొన్నారు. పదేండ్లు వ్యవసాయాన్ని కేసీఆర్ సారు పండుగలా మార్చగా, కాంగ్రెస్ వచ్చి ఆగం చేస్తున్నదని మండిపడ్డారు. వెంటనే రెం డు పంటలకు సంబంధించి పె ట్టుబడి సాయం అందించాలని, లేదంటే సీఎం రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కా గా, బీఆర్ఎస్ చేపట్టిన నిరస నకు అక్కడక్క డా పోలీసులు అడ్డంకులు సృష్టించారు.
కేసీఆర్ సారు రైతును రాజును చేస్తే కాంగ్రెస్ సర్కారు రోడ్డున పడేస్తున్నది. మేం గెలిస్తే రైతు భరోసా ఏడాదికి రూ.15వేలు ఇస్తామని ఎన్నికల్లో ప్రగల్భాలు పలికిన రేవంత్రెడ్డి రెండు పంటలైనా ఎందుకు ఇస్తలేరు. కాంగ్రెస్ అంటేనే కర్షకులకు కష్టాలే తెచ్చే పార్టీ. మొదటి నుంచైనా ఆ పార్టీ తీరే అంత. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని ఎవరిని ఉద్దరించారు. బస్సులు లేక ప్రయాణికులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. రైతులను మోసం చేసే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు.