నాగర్‌కర్నూల్, జనవరి 30 : కందనూలు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ పట్టణంలోని ఎస్జేఆర్ ఫంక్షన్హాల్లో జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి అధ్యక్షతన నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరయ్యారు. నీటి పారుదల, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, ప్రొహిబిషన్, ఎక్సై జ్, అటవీశాఖ, విద్యుత్, విద్య, వైద్యం, గనులు, భూగ ర్భ ఖనిజాలు, వ్యవసాయంతోపాటు పలు శాఖల పనితీరుపై సభలో చర్చించారు. విద్యాశాఖపై చర్చ సందర్భంగా మంత్రి కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం ప్ర భుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల స హకారంతో గ్రామానికో గురుకుల పాఠశాల స్థాయి వి ద్యను సర్కారు స్కూళ్లల్లోనే అందించవచ్చన్నారు. ప్ర జాప్రతినిధులకు వచ్చే నిధులు, కలెక్టర్ నుంచి కొంత నిధులతో మిగిలినవి చందా వసూలు చేసి ప్రతి జీపీలో ని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా ఉదయం 6 నుం చి 9 గంటల వరకు.. సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు అదనంగా ప్రైవేట్‌గా టీచర్లను నియమించి శారీరక వ్యాయామం, విద్యను అందించాలని ఆదేశించారు. వైద్యానికి తమ వంతు కృ షి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మన్ననూర్ నుం చి వటువర్లపల్లి వరకు ఉన్న విద్యుత్కేబుల్ వేలాడుతూ చాలాచోట్ల తీగలు తేలిపోయి షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదాలు జరుగుతున్నాయని సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా కొత్తగా కేబుల్ మార్చడానికి ఎంత అవసరమ న్న ప్రతిపాదనలు పంపించాలని అధికారిని ఆదేశించా రు. వారం రోజుల తర్వాత విద్యుత్‌శాఖపై ప్రత్యేక స మావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పలు శాఖలకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తగా పరిష్కారాలు చూపించారు. అచ్చంపే ట నుంచి మద్దిమడుగు వరకు ఒకే లైన్‌పై 5 సబ్స్టేషన్లు ఉండడంతో లోవోల్టేజీ సమస్య ఏర్పడుతున్నదని వివరించారు. గ్రామాలు, పట్టణాల్లో ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలను మార్చడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఎస్ఈకి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో 200 యూనిట్ల వరకు వినియోగదారులకు ఉచిత విద్యుత్ పథకాన్ని వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను క్రమంగా నిషేధించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు విద్యార్థు లు, యువత బానిసై వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. పోడు భూములు సాగు చేస్తున్న అర్హులైన అందరికీ హక్కు పత్రాలు జారీ చేయాలన్నారు. ఆర్వోఎఫ్ఆర్ ప్రకారం ఇది నిరంతర ప్రక్రియ అని, సరైన ఆధారాలు చూపించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అ మ్రాబాద్ ఉర్దూ పాఠశాలో ఉపాధ్యాయుల కొరత ఉన్నదని, ప్రైవేట్‌గా ఉపాధ్యాయులను నియమించాలన్నా రు. అనంతరం పలువురు జెడ్పీటీసీలు మాట్లాడుతూ పంచాయతీరాజ్‌లో సర్పంచులు పనులు పూర్తి చేసినా ఎంబీ రికార్డులు చేయడం లేదని సభ దృష్టికి తెచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి, కలెక్టర్ ఉదయ్‌కుమార్, అదనపు కలెక్టర్ కుమార్‌దీపక్, జెడ్పీటీసీ సభ్యు లు, అధికారులు పాల్గొన్నారు.