ఆదర్శప్రాయుడు ధర్మభిక్షం
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు, మాజీ ఎంపీ ధర్మభిక్షం నేటి తరానికి ఆదర్శప్రాయుడని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి కొనియాడారు.
- పల్లా వెంకట్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు, మాజీ ఎంపీ ధర్మభిక్షం నేటి తరానికి ఆదర్శప్రాయుడని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి కొనియాడారు. హైదరాబాద్‌లో ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ధర్మభిక్షం 104వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. అట్టడుగువర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడు ధర్మభిక్షం అని అన్నారు. గీత కార్మికుల కోసం రాష్ట్ర, జాతీయస్థాయిలో సంఘాలను ఏర్పాటు చేసి, వారి హక్కుల కోసం పోరాడారని గుర్తుచేశారు. విద్యార్ధి దశ నుంచే అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదని తెలిపారు. ధర్మభిక్షం కేవలం కమ్యూనిస్టు పార్టీకే కాక, అన్ని పార్టీల వారికి ఆత్మీయుడని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ, ప్రభాకర్, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి దామోదర్‌రెడ్డి, పొలగాని రవికిశోర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

