మక్తల్, ఫిబ్రవరి 19 : మండలంలోని కర్ని శివాలయం, పస్పుల వల్లభాపురంలో వెలిసిన దత్తాత్రేయస్వామి ఆలయంలో ఆదివారం శివపార్వతుల కల్యాణోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయాల్లో స్వామివారి కల్యాణం కమనీయంగా జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో తరలొచ్చి కల్యాణాన్ని తిలకించి తరించారు. అనంతరం భ క్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కర్ని లింగమయ్య ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. పస్పుల వల్లభాపురంలో జంగిరెడ్డి కళా బృం దం, జబర్దస్త్ ఫ్రేమ్ రాథోడ్ (పావని) జానపద ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీపీ వన జ, పస్పుల సర్పంచ్ దత్తప్ప, ఎంపీటీసీ రంగప్ప, మాజీ స ర్పంచ్ నారాయణరెడ్డి, ఉప సర్పంచ్ కృష్ణయ్యగౌడ్, వీఆర్ఏ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట, ఫిబ్రవరి 19 : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని లింగయ్యగుడి, బారంబావి శివాలయం, లక్ష్మీగణపతి ఉమామహేశ్వర ఆలయం తదితర ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఉపవాసాలు ఉన్న భక్తులు ఆలయాలను దర్శించుకొని పూజ లు నిర్వహించి ఉపవాసాలు వి రమించారు.
మక్తల్ అర్బన్, ఫిబ్రవరి 19 : పట్టణంలో వెలిసిన అతిపురాతనమైన ఆలయం నంది నగరేశ్వరస్వామి దేవాలయమని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు. ఆదివారం ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
మాగనూర్, ఫిబ్రవరి 19 : మండలంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ఆలయ కమిటీ స భ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూ జలు చేశారు. వడ్వాట్ శివాలయంలో రథోత్సవ కార్యక్రమాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో గణపతి పూజ, రుద్రాభిషేకం, ధ్వజారోహణం, గో పూజ, హోమం, శివపార్వతుల కల్యాణం, అన్నదానం, రథోత్స వం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు, వడ్వాట్ సర్పంచ్ నర్సింహులు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఊట్కూర్, ఫిబ్రవరి 19 : మహా శివరాత్రి పర్వదినోత్స వం సందర్భంగా నిడుగుర్తి గౌరీ శంకరలింగేశ్వర స్వామి గు ట్టపై ఉన్న శివాలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. శివపార్వతులను రథంపై కూర్చోబెట్టి ఊరేగించారు. వైభవోపేతంగా సాగిన కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు కొండపైకి చేరుకున్నారు. ముస్తాబైన తేరును లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. శివపార్వతులకు కల్యాణం, రుద్రాభిషేకం, మహా మంగళహారతి తదితర పూ జా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కొండపై పల్లకీసేవ నిర్వహించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భక్తులకు వసతులు కల్పించారు.