కల్వకుర్తి, జనవరి 18 : కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో కనీస వసతులు కరువయ్యాయి. తాగునీటిని కూడా డబ్బులిచ్చి కొనుగోలు చేయాలి.. లేదా ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. విశ్రాంతి తీసుకునేందుకు చెట్లు లేదా ట్రాక్టర్ ట్రాలీలే గతి. మార్కెట్‌కు ఆదాయం వస్తున్నా.. రైతులకు వసతు లు కల్పించడంలో విఫలమైనట్లు రైతు సంఘాల నాయకులు ఆ రోపిస్తున్నారు. కల్వకుర్తి మార్కెట్లో రెండు రోజులు (గురు, ఆదివారం) ధాన్య క్రయవిక్రయాలు చేపడుతారు. రైతులు వేరుశనగను గురువారం ఉదయం 10 గంటల వరకే మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి ప్లాట్‌ఫాంపై కుప్పలుగా పోశారు. మధ్యాహ్నం 12 తరువాత వ్యాపారులు వేరుశనగకు రహస్య టెండర్లు వేశారు. ఆ తరువాత ధాన్యం తూకాలు వేసే వరకు సాయంత్రం 6 గంటలు దాటుతుంది. ఈ క్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు మార్కెట్ యార్డులోనే ఉండాల్సి వ స్తుంది. అయితే, రైతులకు కనీస వసతులు కల్పించాల్సిన బాధ్య త మార్కెట్ అధికారులపైనే ఉంటుంది. తాగునీరు, విశ్రాంతి గ దులు ఏర్పాటు చేయాలి. రాయితీపై భోజన వసతి కూడా కల్పిం చే వీలుంటుంది. కానీ, కల్వకుర్తి మార్కెట్లో ఇవేవీ కనిపించడం లేదు. రైతులు తాగునీటిని తమ ఊర్ల నుంచి బాటిళ్లలో తెచ్చుకుంటున్నారు. మరికొందరు ఖాళీ డబ్బాలలో వాటర్ ప్లాంట్ల వద్ద నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ విషయంపై మార్కెట్ కార్యదర్శి వివరణకు ప్రయత్నించగా ఆందుబాటులో లేరు.
గురువారం కల్వకుర్తి మార్కెట్ యార్డుకు 119 మంది రైతులు 4,771 బస్తాల వేరుశనగను తీసుకొచ్చారు. క్వింటాకు గరిష్ఠంగా రూ.8,052, కనిష్ఠంగా రూ.6,261, సరాసరిగా రూ.7,516 పలికింది. ఇక్కడ కూడా మోసం జరుగుతున్నది. వ్యాపారులు పేరుకు మాత్రం 5 నుంచి 10 బస్తాలు మాత్రం గరిష్ఠ ధరకు కొనుగోలు చేసి మిగతా వాటిని సరాసరి ధర లేదా అంతకు తక్కువకు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు ముందుగానే సిండికేట్‌గా మారి ధరల విషయంలో రైతులను ముంచుతున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులపై మార్కెట్ అధికారుల అజ మాయిషీ లేనందునే ధర విషయంలో దగా పడుతు న్నామని రైతులు మండిపడుతున్నారు.