కల్వకుర్తి, సెప్టెంబర్ 7 : కన్న కొడుకే కాలయముడిగా మారి తండ్రిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భూ వివాదాల నేపథ్యంలో కల్వకుర్తి పట్టణానికి చెందిన బాలయ్యను కొడుకు హత్య చేశాడని డీఎస్పీ వెంకట్రెడ్డి చెప్పారు. ఆదివారం కల్వకుర్తి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో డీఎస్పీ హత్య వివరాలను వెల్లడించారు. కల్వకుర్తి పట్ట ణం వాసవీనగర్కు చెందిన చాగొండ బాలయ్య (75) ఈనెల 3న పొలానికి వెళ్లి తిరిగిరాకపోవడంతో అతని కొడుకు మల్లయ్య ఈనెల 4వ తేదీన పోలీసులకు ఫిర్యా దు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఐ నాగార్జున, ఎస్సై మాధవరెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేట్టా రు.
పొలం వద్ద నూతనంగా నిర్మిస్తున్న భవనం వద్ద ఉన్న సీసీ టీవీ పుటేజీని పరిశీలించగా బాలయ్య మరో కొడుకు భీరయ్య తండ్రిపై కట్టెతో దాడి చేయడమే కాకుండా గా యపడిన బాలయ్యను కారు డిక్కీలో వేసుకుని పారిపోయినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఘటనా స్థ లంలో వంగూరు మండలం రంగాపూర్ గ్రామానికి చెంది న అంజి కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించి బాల య్య ఆ చూకీ కోసం వెతికారు. ఉప్పునుంతల మండలం కొరటికల్లు సమీపాన దుందుబీ వాగులో తలలేని మొండాన్ని గుర్తించిన పోలీసులు ఆ మృతదేహం బాలయ్యదేనని కు టుంబ సభ్యులు ద్వారా నిర్ధారించుకున్నారు.
డీఎల్ఐ కాల్వలో బాలయ్య తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలయ్యను హత్య చేసింది అతని కొడుకు, బంధువు అంజి అని నిర్ధారించుకున్న పోలీసులు వారి కోసం గాలిం పు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన నిందితులు హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వైపు వస్తుండగా జేపీనగర్ వద్ద పోలీసులు వారిని పట్టున్నారని డీ ఎస్పీ వెల్లడించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకోవడంతో రిమాండ్కు తరలించారు.
భూ వివాదంతో పాటు తన కూతురు మరణానికి తన తండ్రి బాలయ్య కారణమని భావించిన భీరయ్య పొలం వద్ద తండ్రిపై కట్టెతో దాడిచేశాడు. వెంటనే అంజికి ఫోన్ చేసి కారు తీసుకుని రమ్మన్నాడు. అతను కారు తీసుకరాగానే గాయపడిన బాలయ్యను కారు డిక్కీలో వేసుకుని వంగూరు మండలం డిండి చింతపల్లి వైపు వెళ్లాడు. చింతపల్లి సమీపంలో అప్పటికే చనిపోయిన తన తండ్రి మృతదేహం నుంచి తలను వేరు చేశాడు. బాలయ్య మొండా న్ని డిండి వెనుక జలాల్లో విసిరేశారు. తలను డీఎల్ఐ కాల్వలో పడేశారని డీఎస్పీ వివరించారు. నిందితుల నుం చి కారు, బైక్, రంపపు బ్లేడు, నాలుగు చెవి పోగులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ చెప్పారు. సమావేశంలో సీఐ నాగార్జున, ఎస్సై మాధవరెడ్డి ఉన్నారు.