గద్వాల, సెప్టెంబర్ 24 : జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. మంగళవారం ప్రాజెక్టుకు 51 వేల కూసెక్కుల ఇన్ ఫ్లో చేరగా మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318. 460 మీటర్లు ఉన్నది. గరిష్ఠస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీల కు గానూ 9.542 టీఎంసీలు ఉన్నది. ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 720, భీమా లిఫ్ట్-1కు 650, ఆర్డీఎస్ లింక్ కాల్వ కు 50, విద్యుదుత్పత్తికి 37,176 క్యూసెక్కులు మొత్తంగా 61, 276 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
అయిజ, సెప్టెంబర్ 24 : కర్ణాటకలోని ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 9,310 క్యూసెక్కులు ఉం డగా, అవుట్ ఫ్లో 8,700 క్యూసెక్కులుగా నమోదైంది. ఆయకట్టుకు 610 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆనకట్టలో 9 అడుగుల మేరకు నీటి మట్టం ఉన్నది. టీబీ డ్యాంకు ఇ న్‌ఫ్లో 7,980, అవుట్‌ఫ్లో 10,153 క్యూసెక్కులుగా నమోదైంది. 105.788 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 101.539 టీఎంసీల నిల్వ ఉన్నది. అలాగే ఆల్మట్టి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 15,002, అవుట్ ఫ్లో 12,144 క్యూసెక్కులు ఉన్నది. గరిష్ఠస్థాయి నిల్వ 129.72 టీఎంసీలకు గానూ, ప్రస్తుతం 128.19 టీఎంసీల ని ల్వ ఉన్నది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 13,332, అవు ట్ ఫ్లో 14,307 క్యూసెక్కులుగా నమోదైంది. గరిష్ఠస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 37.59 టీఎంసీలు గా ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
మదనాపురం, సెప్టెంబర్ 24 : మండలంలోని సరళాసాగర్ ప్రాజెక్టుకు ఆటో మెటిక్ సైఫన్లు (2 ఉడ్, 1 ఫ్రైమరీ) రాత్రి తెరుచుకున్నాయి. దీంతో మదనాపురం రై ల్వేగేట్ సమీపం లోని రోడ్డుపై మా రెడ్డిపల్లి వాగు రెం డు గంటలపాటు ప్రవహించింది.