గద్వాల, సెప్టెంబర్ 11 : జిల్లా కేంద్రంలోని అ ర్బన్ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై ‘విద్యార్థుల పానీపాట్లు’ కథనం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైంది. దీనిపై ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గంటా కవితాదేవి స్పందించారు. బుధవారం అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
పాఠశాల పరిసరాలు, వంట గదిని పరిశీలించి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జడ్జి దృష్టికి విద్యార్థులు పలు సమస్యలు తీసుకొచ్చారు. ప్రహరీ లేక విషసర్పాలు వస్తున్నాయని, తాగునీరు, పారిశుధ్యం, మ రుగుదొడ్లు, తరగతి గదుల కొరత లేని సమస్యం టూ లేదని వాపోయారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.