ఊట్కూర్, (కృష్ణ) జూలై 20 : కృష్ణ మండలం ‘నమస్తే తెలంగాణ’ విలేకరి రాము, ఫొటోగ్రాఫర్ తాహేర్అలీపై జరిగిన దాడిని ఖండిస్తూ కృష్ణా మండలం టైరోడ్డు వద్ద సో మవారం జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతర్రాష్ట్ర రహదారిపై జర్నలిస్టులు అఖిలపక్ష నాయకులు రోడ్డుపై బైఠాయించడంతో దాదాపు గంట పాటు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. విలేకరులపై దాడి జరగడం కేవలం ఇద్దరు వ్యక్తులపై జరిగిన దౌర్జన్యం కాదని, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా పై జరిగిన దాడి అని ఆందోళనకారులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇసుక అక్ర మ రవాణా, మాఫియా కార్యకలాపాలను ప్రశ్నించినందుకే జర్నలిస్టులపై దాడి జరగడం రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా మంత్రి శ్రీహరికి సంబంధించిన మక్తల్ ని యోజకవర్గంలో శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
ప్రభు త్వం ఇసుక అక్రమ దందాపై ఉక్కుపాదం మోపడంలో పూర్తిగా విఫలమైందని, పోలీ సు యంత్రాంగం కూడా ముందస్తు చర్య లు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి దాడు లు జరుగుతున్నాయని విమర్శించారు. దు ండగులపై ఇప్పటికీ కఠిన చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. పాత్రికేయులపై దాడికి పాల్పడిన నిందితులపై హత్యాయత్నం స హా పలు కఠిన సెక్షన్లు పెట్టి క్రిమినల్ కే సు లు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇసుక మాఫియాపై ప్రత్యేక దాడులు నిర్వహించాలని, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే నిందితులను శిక్షించి బాధిత జర్నలిస్టులకు న్యా యం జరిగేంత వరకు కదిలేది లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదా లు చేస్తూ ఫ్లకార్డులను ప్రదర్శించారు.
ఈక్రమంలో మక్తల్ సీఐ రామ్‌లాల్ నిందితులను శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో పాత్రికేయులు ధర్నాను విరమించారు. ఈ నిరసనకు మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ‘నమస్తే’ బ్యూరో చీఫ్ వెంకటేశ్వర్రావు, మాజీ జెడ్పీటీసీ తనయుడు శివరాజ్‌పాటిల్, మాజీ మార్కెట్ చైర్మన్ నర్సింహాగౌడ్, మాజీ సర్పంచులు సిద్దప్ప, శివప్ప, యువ నాయకులు నర్సింహారెడ్డి, జుట్ల శం కర్, ఈశ్వర్‌యాదవ్, రవి, బీజేపీ రాష్ట్ర నా యకులు అమర్దీక్షిత్, బలరాంరెడ్డి, మండ ల అధ్యక్షుడు నర్సప్ప, అశోక్‌గౌడ్, సీపీఎం జిల్లా నాయకుడు ఆంజనేయులు, భరత్, టీయూడబ్ల్యూజేహెచ్-143 జాతీయ కౌ న్సిల్ సభ్యుడు నవీన్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, టీయూడబ్ల్యూ(ఐజే యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంక ర్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు నారాయణ, లి ంగం, రమేశ్, బాలరాజు, ఎల్లారెడ్డి, వి ఠో భా, మంజూర్ అహ్మద్, ప్రతాప్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, కతలప్ప, శ్రీనివాస్, విజయ్‌గౌడ్, రాజు, కతలప్ప, అశ్వక్ పాల్గొన్నారు.
కృష్ణ పోలీస్ స్టేషన్ ఎస్సై నవీద్ పూర్తిగా ఇసుక మాఫియాకు కొమ్ము కాస్తున్నారని మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశా రు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో అధికార పార్టీ అండతో రాత్రింబవళ్లు అడ్డూ అదుపు లేకు ండా వందలాది టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవ డం లేదని మండిపడ్డారు. ఇసుక మాఫియాకు పోలీసులు అండగా నిలవడం వల్లే ఖనిజ సంపదను బహిరంగంగా కొల్లగొడుతున్నారని, పోలీస్ యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. ఇసుక అక్రమ రవాణా కారణంగా కృ ష్ణ, మాగనూర్ మండలంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందని, భారీ టిప్పర్లు రాత్రింబవళ్లు యథేచ్ఛగా తిరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సి న పోలీసులు మాఫియాకు రక్షణ కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక రవాణా ను వెలుగులోకి తీసుకురావడానికి వెళ్లిన జర్నలిస్టులపైనే దాడులు జరగడం అత్యంత దుర్మార్గమని, ఇసుక మాఫియాను కాపాడేందుకు పాత్రికేయుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు మండిపడ్డారు. కృష్ణ మండలంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న బీఆర్ఎస్ యువనేత శివరాజ్ పాటిల్‌పై మాఫియా బెదిరింపులకు పాల్పడిందని, ఉప్పర్‌పల్లిలో బీఆర్ఎస్ నాయకుడిపై మారణాయుధాలతో కాంగ్రెస్ గూండాలు దాడి కి పాల్పడితే ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వెళ్లిన తనపైనే పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. విలేకరులపై దాడికి పాల్పడిన కాం గ్రెస్ నాయకుడు నారాయణ, అతని అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరె స్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు శా ంతి భద్రతల పర్యవేక్షణ చేతకాకపోతే ప్రజలకు అండగా తామే రంగంలోకి దిగి రౌడీలు, ఇసుక మాఫియా భరతం పడతామని హెచ్చరించారు.
కృష్ణ మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందని, అధికార కాంగ్రెస్ అండదండలతో ఇసుక మాఫియా ఖనిజ సంపదను దోచుకుంటోందని బీజేపీ రాష్ట్ర నాయకుడు అమర్‌కుమార్ దీక్షిత్ ఆరోపించారు. ప్రస్తుతం కృష్ణ మండలంలో ‘ఉల్టా చోర్.. కొత్వాల్ డాటె’ అన్న చందంగా పరిస్థితి పరిస్థితులు మారాయని విమర్శించారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన వారే మౌనంగా ఉండడంతో ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతుందన్నారు. పాత్రికేయులపై దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
పాత్రికేయులపై జరిగిన దాడి ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని విఘాతమని బీజేపీ రాష్ట్ర నేత బల్రాంరెడ్డి అన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా అక్రమాలకు అండగా నిలిస్తే న్యాయం ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. ఇసుక అక్రమ దందాపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఖనిజ సంపద దోపిడీ సాగుతోందని, అందుకు బాధ్యతగా కృష్ణ ఎస్సై నవీద్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
పాత్రికేయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని యూడబ్ల్యూజేహెచ్-143 జిల్లా అ ధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. పాత్రికేయులు, రాము, తహెర్ అలీలపై జరిగిన దాడి ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి మాత్రమే కాదు. అది ప్రతి పాత్రికేయుడిపై జరిగిన దాడి, ప్రజలు తెలుసుకునే హక్కుపై జరిగిన దాడి. భారత రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నాం. నిజాన్ని బయటపెట్టే పాత్రికేయులపై దాడి చేసే వారికి చట్టం కఠినంగా బుద్ధి చెప్పాలి. దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ వెంటనే అరెస్టు చేయాలి. పాత్రికేయుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.