నాగర్‌కర్నూల్, జూలై 4 : వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పోలీస్ అధికారులకు డ్యూటీమీట్ నిర్వహించడం జరుగుతుందని జో గుళాంబ జోన్-7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ తెలిపారు. రెండురోజులుగా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో డ్యూటీమీట్-2025 కార్యక్రమాన్ని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించగా ముగింపు కార్యక్రమానికి డీఐజీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్యూ టీ మీట్ పోలీస్ అధికారులు తాము నిర్వర్తిస్తున్న వృత్తిలో నైపుణ్యత కోసం దోహదపడుతుందన్నారు.
వారు చేపట్టే ఉద్యోగంలో ఎంత నై పుణ్యత ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు డ్యూటీమీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందు లో భాగంగా రెండు రోజులుగా నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన డ్యూటీ మీట్లో జోన్ కు సంబంధించిన గద్వాల, వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ఐదు జిల్లాలకు సంబంధించిన పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొనగా, మొత్తం 24అంశాల్లో పోటీ లు నిర్వహించినట్లు వెల్లడించారు. పోటీల్లో ప్రతి భ కనబరిచిన వారికి మూడు లెవల్స్‌లో విజేతలను గుర్తించి గోల్డ్, సిల్వర్ బ్రౌజ్ మెడల్స్, ప్రశంసాపత్రాలను అందించారు.
జోన్ పరిధిలోని నైపుణ్యత పరీక్షల్లో పాల్గొన్న వారికి 72 మెడల్స్ అన్ని జిల్లాల ఎస్పీల చేతుల మీదుగా అందించా రు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎస్పీ జాన కి, నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేశ్‌గౌతమ్, వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్, నాగర్‌కర్నూల్ అదనపు ఎస్పీ రామేశ్వర్, ఏఆర్ అదనపు ఎస్పీ సురేశ్‌కుమార్, నారాయణపేట అదనపు ఎస్పీ రియాజ్ఉల్హక్, డీఎస్పీ శ్రీనివాసులు, నాగర్‌కర్నూల్ డీసీఆర్బీడీఎస్పీ సత్యనారాయణ, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్, నాగర్‌కర్నూల్ ఎస్బీసీఐ కనకయ్య, నాగర్‌కర్నూల్ డీసీఆర్బీసీఐ ఉపేందర్, వివిధ జిల్లాలకు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.