గద్వాల, సెప్టెంబర్ 19 : ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జోగుళాంబ గద్వాల కలెక్టరేట్లో కలెక్టర్ సంతోష్, రెవెన్యూ అధికారులతో గురువారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓట రు జాబితా సవరణలో ఇంటింటి సర్వే కీలకమని, సర్వేను బూత్‌లెవల్ అధికారుల ద్వారా నిర్విరామంగా చేపట్టాలని సూచించారు. ఈ సర్వేలో కొత్త ఓటర్ల నమోదు, ఫొటో మార్పులు, చిరునామా సవరణలు ఇతర సవరణలు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.
తాసీల్దార్లు తమ పరిధిలోని బూత్ లెవల్ అధికారుల పనితీరును క్షేత్రస్థాయిలోఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఫారం-6 నుంచి ఫారం-8 ద్వారా మరణించిన వ్యక్తుల వివరాలు సేకరిం చి ఓటరు జాబితా నుంచి వారి పేర్లు తొలగించాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతి వారం సమావేశాలు నిర్వహించాలని, డ్రాఫ్ట్ఫొటో జాబితా విడుదల చేయాలన్నారు. అన్ని మండలాల్లో స్వీప్ ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 18ఏండ్లు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయించాలన్నారు.
బీఎల్వోలు ఇంటింటి సర్వేను నిర్ధిష్ట గడువులో పూర్తి చేసి పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందించాలని ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఒంటల్పేట, ప్రభుత్వబాలికల ఉన్నత పాఠశాలల్లో ని బూత్‌లెవల్ అధికారుల ఇంటింటి సర్వే పనులను కలెక్టర్ సంతోష్‌తో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్త ఓటర్లను జాబితాలో నమోదు చేయ డం, మృతిచెందిన వారి పేర్లు తొలగించడం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు.
పోలింగ్ కేంద్రం నుంచి ఓ టర్ల ఇండ్ల్లకు ఎంతదూరం ఉందో తెలుసుకొని ఓటర్లు సు లభంగా చేరుకునేలా సమీప ఎన్నికల కేంద్రాలను కేటాయించాలన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మూడు ఈవీఎం గోదాంలను కలెక్టర్‌తో కలిసి సందర్శించారు. గ ద్వాల కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం గోదాం, ప్రియదర్శిని డిగ్రీకళాశాల వద్ద ఉన్న ఈవీఎం గోదాంలో భద్రతా ఏ ర్పాట్లు పరిశీలించారు. సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థను తని ఖీ చేసి దాని పనితీరు పరిశీలించారు. ఆయా కార్యక్రమా ల్లో అదనపు కలెకర్లు నర్సింగరావు, శ్రీనివాసరావు, ఆర్డీ వో రాంచందర్, తాసీల్దార్లు, బీఎల్వోలు ఉన్నారు.