కల్వకుర్తి రూరల్, సెప్టెంబర్ 23 : వ్యవసాయాన్ని జీవనోపాధిగా నమ్ముకుని జీవిస్తున్న రైతుల నుంచి కాంగ్రెస్ సర్కారు అక్రమంగా భూములను లాక్కొంటూ వారికి ఉపాధి లేకుండా చేస్తోందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆరోపించారు. మంగళవారం కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్తోపాటు పలువురు నాయకులు హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి, కడ్తాల, మాడ్గుల, ఆమనగల్లు మండలాలకు చెందిన రైతుల పక్షాన తెలంగాణ భవన్లో ఈ నెల 25న నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి రావాలని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల ఆమోదం లేకుండా బలవంతంగా బలగాలతో గ్రీన్ ఫీల్డ్రోడ్, త్రిబుల్ ఆర్ రోడ్ అని చెప్పి వేలాది ఎకరాలను కొల్లగొడుతోందని అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గతంలో ఇచ్చిన అలైన్మెంట్ మార్చి కాంగ్రెస్‌లోని పెద్దపెద్ద ప్రజాప్రతినిధులకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తు న్నారని, రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా చూడాలని పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 25న గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్లో నిర్వహిచనున్న నాలుగు మండలాల రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, దీనికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు హాజరవుతున్నారని పేర్కొన్నారు. కావున సమావేశానికి కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.