జడ్చర్ల: ప్రతి గ్రామపంచాయతీలో అందరూ విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా మండలంలోని గొల్లపల్లిలో పల్లె ప్రకృతివనంతో పాటు గ్రామంలోని కాలనీ లు, రోడ్లకు ఇరువైపులా, ఇండ్ల ఎదుట పెద్ద ఎత్తున నాటిన మొక్కలను బుధవారం ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు.
అదేవిధంగా గ్రామంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా దాదాపు 3వందల పాస్కేల్(నక్కతోక) డిజైన్ చెట్లను రంగురంగుల తొట్లలో ఉంచి అడుగు భాగాన్ని తొలగించి తొట్టిని పాతి పెట్టారు. దాంతో ఆ చెట్లు గ్రామానికే కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి. కాగా గ్రామ సర్పంచ్ రాజేశ్వర్రెడ్డి తన సొంత డబ్బుతో ఒక్కో చెట్టును దాదాపు రూ.1250లకు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లను చూసి చెట్లు బాగున్నాయని ఎక్కడి నుంచి తీసుకొచ్చారని ఎమ్మెల్యే సర్పంచ్ని అడిగి తెలుసుకుని అభినందించారు.ఎమ్మెల్యే వెంట జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, నాగిరెడ్డి, శ్రీనివాస్ఉ న్నారు.