జడ్చర్లటౌన్, జనవరి 19 : దేశవ్యాప్తంగా కో ట్లాది మంది ప్రజల కల అయిన అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ నేపథ్యంలో పెన్సిల్ లిడ్స్ తో అరచేతిలో ఇమిడే రామమందిరాన్ని సంతోష్‌చారి రూపొందించాడు. ఈనెల 22న అయోధ్య ప్రారంభం నేపథ్యంలో జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని శివాజీనగర్‌కు చెందిన సంతోష్‌చారి 48 గంటలపాటు శ్రమించి ఉపవాసం ఉండి పెన్సిల్ లిడ్స్తో అంగులం పొడవు, 1.5 అంగులాల వెడల్పు సైజులో ఆలయ నమూనాను తయారుచేశాడు. సం తోష్చారిని పట్టణవాసులు అభినందిస్తున్నారు.