జడ్చర్ల: బాదేపల్లి పత్తి మార్కెట్‌యార్డులో బుధవారం పత్తి కొనుగోళ్లను మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారం భించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పత్తిని బాగా ఆరబెట్టి, చెత్తా చెదారం లేకుండా నాణ్యతగా మార్కెట్‌కు తీసుకురావాలని అప్పుడే మంచి ధర లభిస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు కోసం అనేక పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. రైతులకు పెట్టుబడి సాయంతో పాటు రైతుభీమా, 24గంటల నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నదన్నారు. అదేవిధంగా ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.
రైతులను రాజు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. పత్తికి ప్రభు త్వ కనీస మద్దతు ధర పత్తి పొడవు పింజ రకానికి క్వింటాలుకు రూ.6,025, మధ్య రకం పత్తికి రూ.5,726గా నిర్ణ యించడం జరిగిందన్నారు. ఈ ధరలు పొందాలంటే ప్రభుత్వం నిర్ణయించిన నాణత్యా ప్రమాణాల ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులను తీసుకువచ్చి మంచి ధరలు పొందాలని సూచించారు.
కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమి చైర్మన్ బాద్మి శివకుమార్, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, టీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, మార్కెట్ చైర్మ న్ కాట్రపల్లి లక్ష్మయ్య, మాజీ చైర్మన్ మురళి, మార్కెట్ డైరక్టర్లు సుభాశ్, శివ దర్శన్, నాయకులు నాగిరెడ్డి, రామ్మోహన్, నర్సిములు, కిరణ్, శంకర్, వీరేశ్, విజయ్, శ్రీనివాసులు, పాలాది రమేశ్, మార్కెట్ సిబ్బంది విజయ్‌చందర్, బాలాజీ, రాఘవేందర్, నరేశ్, తదితరులు పాల్గొన్నారు.