అలంపూర్ : గద్వాల జిల్లా అలంపూర్ (Alampur ) పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ( Yoga Day ) ఉత్సాహంగానిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి నాగలక్ష్మి ఆధ్యర్యంలో విద్యార్థులు యోగాసన ప్రదర్శలో పాల్గొన్నారు. పాఠశాల డైరెక్టర్ కె.ఎన్.వి. రవి ప్రకాశ్ మాట్లాడుతూ యోగ ఆవశ్యకత, ప్రాముఖ్యతను వివరించారు.
‘ఏకాగ్రతే విద్యార్థి విజయానికి మూలం. ఆ ఏకాగ్రత సాధనకు యోగ అత్యంత ప్రభావవంతమైన మార్గం. మానసికంగా, శారీరకంగా యోగ బలంగా మార్చి ప్రతీ కష్టాన్ని ఎదుర్కొనగల సామర్థ్యం ఇస్తుందని అన్నారు. కార్యక్రమంలో పీఈటీ శివ నాయుడు, వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు.