అమ్రాబాద్, జూలై 29 : అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మన్ననూర్లోని పర్యావరణ కేంద్రంలో విద్యార్థులకు ‘ప్రకృతి పరిరక్షణలో పులుల ప్రాముఖ్యత’పై ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. అంతకుముందు అమ్రాబాద్ టైగర్ రిజ ర్వ్ పరిధిలోని దోమలపెంట, అమ్రాబాద్‌లో మన్ననూర్ అటవీ, పోలీస్ సిబ్బంది విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ, అడవులు, ప్లాస్టిక్ వాడకంతో కలి గే దుష్ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించా రు.
విద్యార్థులతో కలిసి అధికారులు మొక్కలను నాటా రు. మన్ననూర్ పాఠశాల విద్యార్థులకు ట్రెక్కింగ్‌లో భా గంగా ప్రతాపరుద్రుడి కోటకు తీసుకెళ్లి అక్కడ వృక్ష, జం తుజాలం గురించి వివరించారు. నేచర్ గైడ్స్ వారికి పక్షుల వీక్షణ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖాధికారి రోహిత్ గోపిడీ మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణలో పులుల ప్రాముఖ్యత ఎంతో ఉంటుందన్నారు. అ నంతరం ఈఈసీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దా తలను సన్మానించారు. అటవీశాఖకు, సిబ్బందికి వారు చే సిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఐఎఫ్ఎస్ ట్రెయినీ సుశాంత్ బోబడే, అమ్రాబాద్, దోమలపెంట, మన్ననూర్ అటవీ, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.