తిమ్మాజిపేట : డ్రగ్స్ లేని సమాజం కోసం అందరం కృషి చేయాలని తిమ్మాజిపేట ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి అన్నారు. గురువారం తిమ్మాజిపేట ( Timmajipet ) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం ( International against Drug Day ) నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు విద్యార్థులకు దూరంగా ఉండాలని కోరారు.
డ్రగ్స్ వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు, జీవితం నాశనం అవుతుందన్నారు. డ్రగ్స్ తీసుకోవడం, కలిగి ఉండడం చట్టరీత్య నేరమని, దీనికి కఠిన చర్యలు ఉంటాయన్నారు. యువత, విద్యార్థులు డ్రగ్స్ కు ఎక్కువగా బానిసలు అవుతున్నారని తెలిపారు. ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అనసూయ, అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది శరత్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.