వనపర్తి, ఫిబ్రవరి 25: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. జిల్లాకేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ పనులను శనివారం అధికారులు, నాయకులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు.
ఈ మార్కెట్ పనులు పూర్తయితే ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు అవుతుందన్నారు. అలాగే రూ.5.75 కోట్లతో నిర్మిస్తున్న టౌన్‌హాల్‌ను సైతం త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌గౌడ్, నాయకుడు ప్రేమ్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.