గద్వాల, జూన్14: జూరాల ప్రాజెక్టుకు వరద నిలకడగా కొనసాగుతున్నది. శుక్రవారం 6,558 క్యూసెక్కుల వరద చేరినట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.517 టీఎంసీలు ఉన్నది. అ యితే ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 354 క్యూ సెక్కులు, భీమా లిఫ్ట్-1కు 568 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 230 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొత్తం అవుట్‌ఫ్లో 1,280 క్యూసెక్కులుగా నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.