జూరాల ప్రాజెక్టుకు వరద నిలకడగా కొనసాగుతున్నది. శుక్రవారం 6,558 క్యూసెక్కుల వరద చేరినట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.517 టీఎంసీలు ఉన్నది.
వర్షాలు పుష్కలంగా కురవడం..ఎగువన కృష్ణాబేసిన్‌లో వచ్చిన వరద కారణంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జలవిద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది లక్ష్యానికి మించి రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించారు.