మహబూబ్‌నగర్, నవంబర్ 28 : పండంటి బిడ్డకు జన్మనిచ్చానని ఆనందపడేలోపే వైద్యుల నిర్లక్ష్యం య ముడి రూపంలో వచ్చి ఓ మాతృమూర్తి ప్రాణాన్ని అ మాంతం హరించిన ఘటన మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో చోటుచేసుకున్నది. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం ఆశిరెడ్డిపల్లికి చెందిన గర్భి ణి రజిత(35)కు శనివారం నొప్పులు రావడంతో మహబూబ్‌నగర్ దవాఖానకు ప్రసవం కోసం వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఇంకా ప్రసవ సమయం కాలేదని, గు రువారం రమ్మని చెప్పి పంపించారు. బుధవారం మళ్లీ నొప్పులు రావడంతో ఆశకార్యకర్త సాయంతో జిల్లా దవాఖానకు వచ్చింది.
వైద్యులు అంతాబాగానే ఉంది.. గురువారం డెలివరీ చేస్తామని చెప్పి గైనిక్ వార్డులో అడ్మిట్ చేశారు. రాత్రి 8:30 గంటలకు నొప్పులు అధికం కావడంతో వైద్య సిబ్బందికి విషయం చెప్పారు. సిజేరియన్ చేయగా, మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం రజితను బాలింతల వార్డుకు షిఫ్ట్ చేశారు. కొంత సమయానికి తీ వ్రంగా నొప్పులు వస్తున్నాయని వైద్య సిబ్బందికి చెప్ప గా, పట్టించుకోకుండా డాక్టర్లు వచ్చి చూస్తారని నిర్లక్ష్యం గా సమాధానమిచ్చారు.
గురువారం తెల్లవారుజామున మళ్లీ కాళ్లు, చేతులు గుంజుతున్నాయని చెప్పగా, పరీక్షించి వెంటనే ఐసీయూకి తరలించారు. అప్పటికే పరిస్థి తి విషమించి 6 గంటల ప్రాంతంలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆరోగ్యం బాగాలేదని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా చనిపోయిందని చెబుతారా అంటూ కుటుంబ సభ్యులు వైద్యసిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. సరైన సమయంలో వైద్యం అం దించి ఉంటే బతికేదని, నిర్లక్ష్యం కారణంగానే తన భార్య చనిపోయిందని ప్రకాశ్‌రెడ్డి వాపోయాడు. పరీక్షించాలని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోకుండా బెదిరింపులకు గురిచేసి ప్రాణాన్ని బలిగొన్నారని మండిపడ్డారు.
పసిపాపకు తల్లిని పోగొట్టుకున్న దుఖంలో కుటుం బం వైద్యుల తీరును ప్రశ్నిస్తే ఇందుకు ఓ వైద్యులురాలి తీరు సభ్యసమాజం తలదించుకునేలా మారింది. దవాఖానలో ఎన్నో డెలివరీలు చేస్తున్నాం.. ఒకరి చనిపోతే మాపై నిందలు మోపుతారా అనడంపై అక్కడున్న వా రంతా అసహనం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంతో ఒకరి ప్రా ణాలు కోల్పోయేందుకు కారకులు కావడంతోపాటు తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాగా, విధుల్లో నిర్లక్ష్యం వహించి తన భార్య మరణానికి కారణమైన వైద్యసిబ్బందిపై చర్య లు తీసుకోవాలని దవాఖాన సూపరింటెండెంట్ సంపత్‌కుమార్ సింగ్‌కు మృతురాలి భర్త ప్రకాశ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ హామీ ఇవ్వగా, అక్కడి నుంచి బాధిత కుటుం బ సభ్యులు శవాన్ని తీసుకెళ్లారు.