గద్వాల, ఆగస్టు 13 : వైద్యుల సమయపాలన పాటించకపోవడంతో ప్రభుత్వ దవాఖాన వచ్చే రోగులు అవస్థలు పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటినా కొందరు డాక్టర్లు విధులు హాజరు కాకపొవడంతో రోగులకు సరైన వైద్యం సమయానికి అందడం లేదు. జిల్లా కేంద్రంలో ఉ న్న వైద్యవిధాన పరిషత్ దవాఖాన ప్రస్తుతం జిల్లా దవాఖానగా రూపాంతరం చెందింది. అందుకు అవసరమైన సౌకర్యాలు కేసీఆర్ సర్కారు కల్పించింది.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న సౌకర్యాలను వినియోగించుకోలేని పరిస్థితి నెలకొన్నది. ప్రతి రోజూ 600 నుంచి 700 వరకు ఓపీ ఉంటుంది. 100 నుంచి 150 దాక ఇన్పేషెంట్లు ఉంటున్నారు. అయితే ప్రస్తుతం జిల్లా దవాఖానగా ఏర్పాటు కావడంతోపాటు త్వరలో మె డికల్ కళాశాల ప్రారంభం అవుతుండడంతో మెడికల్ కళాశాల కోసం అవరమైన సిబ్బందిని 42 మందిని ప్రభుత్వం నియమించింది.
వీరితోపాటు ప్రస్తుత దవాఖానలో 30 మంది నర్సింగ్ స్టాఫ్ ఉండగా మెడికల్ కళాశాల కోసం మ రో 56 మందిని తీసుకున్నారు. అయితే తీసుకున్న వైద్య సిబ్బందిలో సగ భాగం వైద్యులు సరైన సమయానికి విధులకు రాక పోవడంతో రోగులు డాక్టర్ల కోసం ఎదురు చూస్తున్నారు. మంగళవారం నమస్తే తెలంగాణ జిల్లా దవాఖాన ను ఉదయం 10 గంటలకు సందర్శించిన సమయంలో సూపరింటెండెంట్, ఆర్ఎం వారి స్థానాల్లో లేకపోవడం గ మనార్హం. వారే సరైన సమయానికి రాకుంటే కింది స్థాయి డాక్టర్లు, సిబ్బంది ఎలా హాజరవుతారనేది రోగుల ప్రశ్న.
పత్తాలేని డాక్టర్లు..
ఉదయం 9:30గంటల తర్వాత డాక్టర్ల గదులను పరిశీలిస్తే మానసిక చికిత్స విభాగం, జనరల్ సర్జరీ, దంతవిభా గం, ఆప్తామాలజీ డాక్టర్లు విధులకు హాజరు కాలేదు. మం దుల స్టోర్ గది తెరవలేదు. అయితే నర్సులు అందుబాటులో ఉండడంతో రోగులకు కొంత ఉపశమనం కలిగించే అంశం. రోగులకు పరీక్షలు దవాఖానల్లో చేస్తున్నా.. రిజల్ట్ ఆలస్యం అవుతున్నది. మందులు అందుబాటులో ఉన్నా రోగులకు అరకొర మందులు మాత్రమే ఇస్తున్నారు.
కొత్త కదా ఆలస్యం అవుతుంది..
ఈ మధ్యనే మెడికల్ కళాశాల కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్స్ను నియమించాం. నియమించిన వైద్య సిబ్బంది వివిధ ప్రాంతాల నుంచి వ స్తుండడం వల్ల కొంత ఆల స్యం అవుతుంది. అయిన రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించిన తర్వాతే వారు వెళ్తున్నారు. కొత్త కదా కొంత ఆలస్యమవుతుందని డాక్టర్లను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేసింది.
– డాక్టర్ పార్వతి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్
ఇబ్బందుల్లేకుండా వైద్య సేవలు
జిల్లా దవాఖానలో రోగులకు ఇబ్బందులు కలగకుం డా వైద్య సేవలు అందిస్తు న్నాం. రోగులకు అవసరమై న టెస్టులు, మందులు దవాఖానలో అందజేస్తున్నాం. ప్ర తి రోజూ 60 దాకా ఎక్స్రేలు తీస్తున్నాం. డయాలిసిస్లో మొత్తం 94 మంది పేర్లు న మోదు చేసుకున్నారు. 12 బెడ్లు ఉన్నాయి. షిఫ్ట్ సి స్టం ద్వారా వారికి డయాలిసిస్ చేస్తున్నాం. డాక్టర్లు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకుంటా.
– డాక్టర్ వినోద్, సూపరింటెండెంట్