కోస్గి, జూలై 6 : ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం ఇది కాంగ్రెస్ అగ్ర నాయకుల నానుడి. కానీ సీఎం ఇలాకా కోస్గి మండలంలో మాత్రం ఇం దిరమ్మ రాజ్యం నమ్ముకున్నోడికి దౌర్భాగ్యం అన్న చందంగా మారింది. నాయకుల తీరుతో ఎదు రు ప్రశ్నించలేక సామాన్యులు ఉన్న ఇండ్లతోనే సర్దు కుపోతున్నారు. చాలా మంది అర్హులు ఉన్న వారిని గుర్తించకుండా తమ వాళ్లకే ఇండ్ల మంజూరు అన్న ట్టు నాయకులు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. సీఎంగా రేవంత్రెడ్డి గెలిచాకా తమ బతుకులు మారుతాయనుకున్న నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయకుండా తమ అనుకున్న వారికే ఇండ్లను మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు.
మార్పు మొదలైంది అనుకుంటున్న పేదవారి జీవితాలలో మార్పు ఇలా వచ్చింద ని కొందరు వ్యంగంగా బహిరంగంగా విమర్శిస్తున్నా రు. మండలంలో ఎంతోమంది నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నా వాటన్నింటినీ కాదని తమ వారికే మంజూరు చేసుకున్నారు. ఇందులో అధికారులు సైతం మౌనంగా ఉండి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. గతవారం ఓ మహిళ తనకు ఇల్లు మంజూరు చేయండి సార్ అంటూ మున్సిపల్ కమిషనర్ కాళ్లపైపడ్డ తీరు చూశాకా మండలంలో ఇండ్ల మంజూరులో ఎవరిపాత్ర ఏంటన్న దానిపై స్ప ష్టత వచ్చింది.
మరికొందరు నాయకులు కూడా వచ్చేఎన్నికలలో ఓట్ల కోసం తమవర్గం వారికే ఇండ్లు మంజూరు చేయడంతో మిగతా వారు వచ్చే ఎన్నికలలో ఓటు విలువేంటో వారికి తెలియజేస్తామని గ్రామాల్లో బహిరంగంగా సవాలు విసురుతున్నారు. కోస్గి మండలంతోపాటు అన్ని గ్రామాల్లో కొందరు నాయకులు ఎన్నికల సమయంలో ఆక్టివ్గా ఉండి నేడు కొందరి తీరుతో అసంతృప్తిగా ఉంటూ మౌనం ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న తమ పను లు కావాలన్న ఓ ముఖ్యనేత చెబితేనే తమ పనులు అవుతున్నాయని అలాంటి పనులు చేసేకన్నా మౌ నంగా ఉండడమే మేలని కొందరు సీనియర్లు కీనుక వహిస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఇదే తంతు కొనసాగు తుండడంతో చేసేది లేక ఎన్నికల వరకు వేచి చూడాలి అన్న ధోరణితో ఉన్నారు. ప్రతి పథకానికి క్షేత్రస్థాయిలో అర్హులెవరో అనర్హులెవరో పరిశీలించాల్సిన అధికారులు సైతం నాయకుల తీరు తో వారు చెప్పిన వాటికే మౌనంగా పని కానిస్తున్నా రు. చాలామంది నిరుపేదల సంక్షేమం కోసం తెచ్చిన ఈ పథకం కాంగ్రెస్ కబంధ హస్తాల్లో నలిగిపోతూ పేదోడి పట్ల భస్మాసుర హస్తంగా మారింది. ఇది ఒక్క కోస్గి మండలంలోనే కాదు దాదాపు కొడంగల్ నియోజకవర్గమంతా ఇదే తంతు కొనసాగుతున్నది.