అచ్చంపేట రూరల్ : మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట పట్టణంలో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలను ( Indipendence Day ) ఘనంగా జరుపుకున్నారు. బీఆర్ఎస్ ( BRS ) ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ సీనియర్ నాయకులు పోకల మనోహర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన మహనీయులు చిరస్మరణీయులని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎడ్ల నర్సింహ గౌడ్, తులసీరాం, నాయకులు అమినోద్దిన్, మాజీ ఎంపీపీలు పర్వతాలు, కరుణాకర్ రావు, స్థానిక కౌన్సిలర్లు మనుపటేల్, కుత్బుద్దీన్, రమేష్ రావు, అంతటి శివ, పార్టీ నాయకులు కోట్ల నరేందర్ రావు, రాజేశ్వర్ రావు, రహమత్, ఖలీల్, ఖాజా, సోషల్ మీడియా ఇంచార్జి పిల్లి బాలరాజు,తదితరులు పాల్గొన్నారు.