అయిజ, మార్చి 9 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో స్వల్పంగా ప్రారంభమైంది. టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్, కేసీ కెనాల్ జాయింట్ ఇండెంట్ నీటిని ఈ నెల 5న కర్ణాటకలోని ఎల్ఎల్సీ ప్రధానకాల్వ గుండ్లకేరీ సమీపంలోని ఎస్కేప్‌ల 4వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నదిలో ఐదు రోజులపాటు ప్ర వహిస్తూ ఆదివారం సాయంత్రం ఇన్‌ఫ్లో ఆర్డీఎస్ ఆనకట్టకు స్వల్పం గా చేరుతున్నది. ఉమ్మడి నీటి వాటా నీళ్లు ఆర్డీఎస్ ఆనకట్టకు చేరు తుండటంతో ఆనకట్టలో నీటి మట్టం క్రమేపీ పెరుగుతున్నది.
ఆర్డీ ఎస్, కేసీ కెనాల్ ఉమ్మడి ఇండెంట్లో భాగంగా చివరి నీటి వాటా 2.6టీఎంసీల నీటిని ఈ నెల 13 వరకు ఇండెంట్‌ను విడుదల చేయ నున్నారు. రోజుకు 4వేల క్యూసెక్కుల చొప్పున టీబీ బోర్డు విడుదల చేస్తోంది. ఎల్ఎల్సీ కాల్వ ద్వారా విడుదల చేస్తున్న నీళ్లు ఆర్డీఎస్ ఆనకట్టకు చేరుతున్నది. దీంతో సోమవారం ఉదయం వరకు ఆర్డీఎస్ ఆనకట్టపై ఓవర్ ఫ్లో అయ్యే అవకాశం ఉంటుందని ఆర్డీఎస్ ఈఈ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆనకట్టకు వచ్చిన నీళ్లను వచ్చినట్లే ఆర్డీఎస్ ప్రధానకాల్వకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొ న్నారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు అందించేందుకు చర్యలు తీసుకుం టున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్డీఎస్ ఆనకట్టకు నీరు చేరడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పంటలు ఎండుతాయోనని ఆందోళనలో ఉన్న రైతులు నీటి చేరికతో సంతోషంతో ఉన్నారు.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ 26.454 ఉండగా, అవుట్‌ఫ్లో 10,040 క్యూసెక్కులు ఉంది. 105.788 టీఎంసీల గరిస్ఠ సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 26.454 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1,633 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి గాను, ప్రస్తుతం 1,603.54 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.