మహబూబ్‌నగర్, ఏప్రిల్ 14 : ఈత కు వెళ్లిన ఇద్దరు మృతి చెందగా.. మరొకరు కాపాడే యత్నంలో నీటిలో మునిగిపోగా.. మరో ఇద్దరు గల్లంతైన సంఘటన మహబూబ్‌నగర్ జి ల్లాలో చోటు చేసుకున్నది. పో లీసుల కథనం మేరకు.. మ హబూబ్‌నగర్ జి ల్లాలోని దివిటిపల్లి స మీపంలో ఉన్న డబు ల్ బె డ్రూం ఇండ్లల్లో మై మూద్(27), విజ య్(30), అయ్యప్ప (18) నివసిస్తున్నారు.
మై మూద్ వెల్డింగ్ పనిచేస్తుండగా.. మిగితా ఇద్దరు ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఇండ్ల సమీపంలోని క్వారీ వద్ద ఉన్న నీటిలో ఈత కొట్టేందుకు వీరు వెళ్లారు. అయితే నీటిలో మునిగిపోతుండగా.. వీరిని కాపాడేందుకు అక్కడే ఉన్న కొందరు ప్రయత్నించినా లా భం లేకపోయింది.
ముగ్గురు నీటి లో మునిగిపోయారు. తర్వాత కొంద్దిసేపటికి విజయ్ మృతదేహాన్ని బయటకు తీయ గా.. మరో ఇద్దరి ఆచూ కీ ఇంకా లభించలేదు. విషయం తెలుసుకొ న్న రూరల్ ఎస్సై విజ య్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకొన్నారు. ఇద్దరి మృతదేహల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.