పిచ్చికుక్కల స్వైరవిహారం
పిచ్చికుక్కలు స్వైరవీహారం చేస్తూ ఎనిమిది మందిపై దాడి చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకున్నది. స్థానికులు కథనం ప్రకారం పిచ్చికుక్కలు రోడ్డు వెళ్తున్న వారిపై దాడి చేయడంతో ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. గ్రామంలో 8మందికి పైగా పిచ్చికుక్కలు దాడి చేసినట్లు వారు తెలిపారు.
- బల్మూరులో ఎనిమిది మందిపై, అలంపూర్ మండలంలో చిన్నారులపై దాడి చేసిన వైనం
బల్మూరు, ఏప్రిల్ 25 : పిచ్చికుక్కలు స్వైరవీహారం చేస్తూ ఎనిమిది మందిపై దాడి చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకున్నది. స్థానికులు కథనం ప్రకారం పిచ్చికుక్కలు రోడ్డు వెళ్తున్న వారిపై దాడి చేయడంతో ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. గ్రామంలో 8మందికి పైగా పిచ్చికుక్కలు దాడి చేసినట్లు వారు తెలిపారు. క్షతగాత్రులకు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్లను వేయించారు. గ్రామంలో ధర్మతేజ, సాయి, పవన్‌కుమార్, బాలయ్య, మణికంఠ, శివకుమార్, నాగమణి అలాగే కొండనాగుల గ్రామంలో ఒకరిపై పిచ్చికుక్క దాడి చేసినట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పిచ్చికుక్కల నుంచి గ్రామస్తుల నుంచి కాపాడాలని క్షతగాత్రుల బంధువులు కోరుతున్నారు.
కోనేరు గ్రామంలో పలువురు..

Mm
అలంపూర్, ఏప్రిల్ 25 : పిచ్చి కుక్క దాడిలో ఇద్దరు చిన్నారులు గాయాల పాలైన ఘటన అలంపూర్ మండలంలోని కోనేరు గ్రామంలో శనివారం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన తిమ్ములమ్మ, స్వాములు దంపతులకు ఆరేండ్ల జీవన్ బాబు, నాలుగేండ్ల కూతురు మధు కుమారి ఉన్నారు. వీరు పిచ్చి కుక్క కాటుకు గురికావడంతో తల్లిదండ్రులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం కర్నూలు దవాఖానకు 108లో తరలించినట్లు ఈఎంటీ రాజా రత్నం, పైలట్ శ్రీశైలం తెలిపారు. గ్రామంలో వీధి కుక్కల బెడద లేకుండా అధికారులు చొరవ చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
12న మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం.. ఎల్ నినో ఎఫెక్ట్, వర్షాభావ పరిస్థితులపై చర్చించే అవకాశం
ఫుడ్ పాయిజన్ ఘటనపై సుమోటో కేసు.. నివేదిక ఇవ్వాలని హెచ్ఆర్సీ చైర్పర్సన్ షమీమ్ అక్తర్ ఆదేశం
అపార్ట్మెంట్ ఎనోవోసీకి 24 మీటర్ల పరిమితి.. ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ వెల్లడి
మరో పోరుకు నాంది పలుకుదాం
ఢిల్లీ పాలకుల గుండెల్లో రైళ్లు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

