బిజినేపల్లి, మే 16 : వ్యవసాయ రంగం మున్ముందు మరింత కీలకం కానున్నదని, వ్యవసాయ విద్యకు ఉజ్వల భవిష్యత్తు ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పాలెం ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం లో నూతనంగా రూ.29కోట్లతో నిర్మిం చిన వ్యవసాయ కళాశాల భవనాన్ని ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ భిన్నమైన వ్యవసాయ, బీమా, మా ర్కెటింగ్, ప్రాసెసింగ్, విత్తన రంగాల్లో అ నేక అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి వ్యవసాయ కళాశాలను పాలెంలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. వరంగల్, సిరిసిల్లలో మరో రెండు కళాశాలలను ఏర్పాటు చేసుకున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు కళాశాలలు ఉన్నాయని తెలిపారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి పీజీ కళాశాలను పాలెం వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసేలా కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగానికి రెండు సవాళ్లు ఉన్నాయని, ప్రపంచ జనాభాకు పౌష్టికాహారం అందించడం, ప్రపంచ వ్యాప్తంగా భూవాతావరణంలో వస్తున్న పెనుమార్పులను నిలదొక్కుకొని వ్యవసాయ రంగం మనుగడను సాగించడమేనని అన్నారు. దేశంలో అనేక వ్యవసాయ పరిశోధన సంస్థలను నెలకొల్పి వ్యవసా య రంగాన్ని సుస్థిరం చేసిన మహానుబావుడు బాబు జగ్జీవన్‌రామ్ అని అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ని పుణులు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చేనెలలో హైదరాబాద్‌లో జీ20లో ఈ అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ముందుందన్నారు.
శాస్త్రవేత్తల కృషి అభినందనీయం : ఎంపీ రాములు
కొత్త వంగడాలను కనిపెట్టడంలో శాస్త్రవేత్తల కృషి అభినందనీయమని ఎంపీ రా ములు అన్నారు. ప్రభుత్వం వ్యవసాయానికే పెద్దపీట వేసిందన్నారు. వి ద్యార్థులు రైతులతో మమేకమై పరిశోధనలు చేస్తూ అంచలంచలుగా ఎదగాలన్నారు.
కొత్త విధానాలు అవసరం : ఎమ్మెల్యే మర్రి
వ్యవసాయ రంగంలో అత్యాధునిక విధానాలను తీసుకువచ్చి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే విధంగా విద్యార్థులు, శాస్త్రవేత్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. వ్య వసాయానికి ప్రాధాన్యత ఇవ్వడంలో భా గంగా కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయ కళాశాలలను నెలకొల్పడం జరిగిందన్నారు.
మూడు కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం: వీసీ సుధీర్‌కుమార్
స్వరాష్ట్రంలో మూడు నూతన వ్యవసా య కళాశాలలను ఏర్పాటు చేశామని వైస్ ఛాన్స్లర్ సుధీర్‌కుమార్ అన్నారు. మొదటగా పాలెంలో కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. కళాశాలలో గతంలో 60 సీట్లు మాత్రమే ఉండేదని, ప్రస్తుతం 160 సీట్ల వరకు పెంచడం జరిగిందన్నారు. అదనపు కలెక్టర్ మోతీలాల్, ఏడీఆర్ మల్లారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హన్మంతురావు, వ్యవసాయ కళాశాల అసోసియేషన్ డీన్ పుష్పవతి, కేవీకే కోఆర్డినేటర్ ప్రభాకర్‌రెడ్డి, మా ర్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్‌లు మాధవి, మాధవరెడ్డి, లావణ్య, రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.