పాలమూరు, జనవరి 22 : అయోధ్యలో నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం, బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా మహబూబ్‌నగర్ పట్టణంతోపాటు మండలంలోని వివిధ ఆలయాల్లో సోమవారం ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎదిర ఆంజనేయస్వామి, టీచర్స్ కాలనీ రామాలయం, హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆంజనేయస్వామి, టీడీగుట్ట వేంకటేశ్వరస్వామి, వాసవీ కన్య కా పరమేశ్వరి, హనుమాన్పూర పవనపుత్ర ఆంజనేయస్వామి, పంచముఖ ఆంజనేయస్వా మి, అప్పన్నపల్లిలోని సంజీవకొండల ఆంజనేయస్వామి, గణేశ్‌నగర్‌లోని ఆంజనేయస్వామి, వేపూరిగేరిలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు.
హన్వాడ, జనవరి 22 : మండలంలోని వివిధ గ్రామాల్లోని ఆంజనేయ, శ్రీరామాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అనంతరం శ్రీరాముడి శోభాయాత్ర నిర్వహించి అన్నదానం ఏర్పాటు చేశారు. హన్వాడ, దొర్రితండా గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
మహ్మదాబాద్, జనవరి 22 : మండలంలో ని వివిధ గ్రామాల్లోని ఆలయాల్లో ప్రజలు ప్ర త్యేక పూజలు నిర్వహించారు. రామాలయం లో ప్రత్యేక స్క్రీన్‌పై అయోధ్యలో జరుగుతున్న ఉత్సవాలను భక్తులు తిలకించారు.
మూసాపేట, జనవరి 22 : అయోధ్యలో శ్రీ రాముని ప్రాణప్రతిష్ఠ పూజా మహోత్సవాన్ని పురస్కరించుకొని మూసాపేటతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొన్నది. సోమవారం ఉదయం విగ్రహాలతో శో భాయాత్రగా ఆలయాలకు చేరుకున్నారు. ఉత్స వ విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశా రు. జానంపేటలో హిందూవులతోపాటు ము స్లింలు కలిసి విగ్రహాల ఊరేగింపులో పాల్గొని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు.
మూసాపేట(అడ్డాకుల), జనవరి 22 : దక్షి ణ కాశీగా పేరుగాంచిన కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవరకద్రలోని సత్యసాయి ట్రేడర్స్ కు చెందిన రాములుగౌడ్ భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. అనంతరం కరసేవకులను సన్మానించారు.
దేవరకద్ర, జనవరి 22 : మండల కేంద్రంలోపాటు అన్ని గ్రామాల్లో కాషాయం తోరణా లు వెలిశాయి. గ్రామ పురవీధుల్లో సందడి నెలకొనగా.. రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తర్వాత ఆలయ ప్రాంగణంలో సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. స్వామికి పల్లకీసేవ, శోశాయాత్ర నిర్వహించారు.
బాలానగర్, జనవరి 22 : మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లోని అంజన్న ఆలయా ల్లో ప్రత్యేక ప్రజలు జరిపారు. గణపతి హో మం, హనుమాన్ చాలీసా పారాయణం, ఆం జనేయుడు, శ్రీరాముడిని కొలుస్తూ భక్తి గీతా లు అలపించారు. మధ్యాహ్నం అన్నదానం ని ర్వహించగా.. అనంతరం శ్రీరాముడి చిత్రపటంతో బైక్ ర్యాలీ చేపట్టారు. బాలానగర్ హ నుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పూజలు చేశారు. కార్యక్రమంలో దత్తాత్రేయ్య, శంకర్‌నాయక్, తిరుపతి పాల్గొన్నారు.
రాజాపూర్, జనవరి 22 : మండలంలోని ప్రతి పల్లె రామనామంతో పులకించిపోయింది. రాజాపూర్, తిర్మలాపూర్, చొక్కంపేట, దోండ్లపల్లి, రంగారెడ్డిగూడ, ఈద్గాన్‌పల్లి, రాయపల్లి, కుచ్చర్కల్, చెన్నవెల్లితోపాటు పలు గ్రామాల్లో శ్రీరామ, ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తు లు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తుల ను భజనకీర్తనలు ఆలపిస్తూ కోలాటాల ఆడు తూ విధుల్లో ఉరేగించారు.
భూత్పూర్, జనవరి 22 : భూత్పూర్ పట్టణంలోని ఆంజనేయస్వామి, రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో అర్చకులు, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, సూర్యకళ, రామకృష్ణ, మాజీ సర్పంచులు సత్తూర్ నారాయణగౌడ్, శోభారత్నం, ఆలయ కమిటీ సభ్యులు, మాతృమండలి సభ్యులు, భజన బృందాలు పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), జనవరి 22 : కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలాల్లో సీ తారాములకు భక్తులు పూజలు చేశారు. కౌకుంట్లలో చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో చిన్నారులు రామాయణ నాటకాన్ని ప్రదర్శించారు. అనంతరం గ్రామస్తులు భజనలు చేస్తూ రాములవారి శోభాయాత్ర నిర్వహించారు. కౌ కుంట్ల మండలం పేరూర్లో ఆలయ ధర్మకర్త లు బీ. ప్రకాశ్ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో సీతారాముల ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ చామన్కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఊట్కూర్, జనవరి 22 : మండలంలోని అ న్ని గ్రామాల్లో వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. నిడుగుర్తిలో భారీ కటౌట్‌తో శోభాయాత్ర నిర్వహించారు. ఎల్బీనగర్ హనుమాన్ ఆలయ క మిటీ ఆధ్వర్యంలో గోపూజ నిర్వహించారు. ఎర్గట్‌పల్లి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు సీతారాముల వేషధారణతో ఆకట్టుకున్నారు.
నవాబ్‌పేట, జనవరి 22 : నవాబ్‌పేట, య న్మన్గండ్ల, చెన్నారెడ్డిపల్లి, కిషన్‌గూడ, కొండాపూర్, శ్యామగడ్డతండా, కారూర్, లోకిరేవు, కేశవరావుపల్లి తదితర గ్రామాల్లో శ్రీరాముడి చిత్రపటంతో శోభాయాత్రలు నిర్వహించారు. యువకులు, భక్తులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమాల్లో సర్పంచులు గోపాల్‌గౌడ్, జయమ్మ, యాదయ్యయాదవ్, నిర్మలమ్మ, బొజ్జమ్మ, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
నారాయణపేటరూరల్/టౌన్, జనవరి 22 : మండలంలోని జాజాపూర్, అప్పిరెడ్డిపల్లి, అ ప్పక్పల్లి, సింగారం, భైరంకొండ, జిలాల్పూర్తోపాటు తదితర గ్రామాల్లోని వివిధ ఆలయా ల్లో ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. పలు పాఠశాలల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయాల్లో భక్తుల కోసం అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేశారు. నారాయణపేట పట్టణంలో ని సరస్వతీ శిశుమందిరం ఉన్నత పాఠశాల వి ద్యార్థులు సీతారాముడు, లక్ష్మణుడు, దశరథమహారాజు, వాల్మీకి, భరతుడు, వానరసేన తదితరుల వేషధారణలతో పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు.
మక్తల్ అర్బన్/టౌన్, జనవరి 22 : అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్ర హ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోమవారం మక్తల్‌లోని పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూ జలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. మక్తల్ మండలం ఉప్పరపల్లి , లింగంపల్లి, మ ధ్వార్, జక్లేర్, అనుకొండ, సామాన్పల్లి, గుడిగండ్ల, సంగంబండ, కర్ని తదితర గ్రామాల్లో ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రజలు శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమా ల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరికల్, జనవరి 22 : మండలంలోని చిత్తనూర్‌లో ఎర్రగుట్టపై సీతారాముల విగ్రహలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు వైభవం గా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం గ్రామాల్లో శోభాయాత్ర చేపట్టారు.
దామరగిద్ద, జనవరి 22 : మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు చేశా రు. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక భజనలు, సంకీర్తనలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. విద్యార్థులు సీతారాముల వేషధారణలో శోభాయాత్ర నిర్వహించారు.
మద్దూర్(కొత్తపల్లి)/ధన్వాడ, జనవరి 22 : మ ద్దూ రు, కొత్తపల్లి మండలాల్లో సోమవారం ప్ర జ లు ఆలయాల్లో పూజలు చేశారు. మ ద్దూరులో భాష్యం స్కూల్ విద్యార్థులు సీతారాముల వేషధారణతో శోభాయాత్ర నిర్వహించారు. ధన్వాడ మండలం మందిపల్లిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో సీతారాముల విగ్రహాలతోపాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాలకు మక్తల్, నారాయణపేట మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎస్ రాజేందర్రెడ్డితోపాలు పలువురు నాయకులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
కృష్ణ, జనవరి 22 : మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు వివిధ ఆలయాల్లో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
జడ్చర్ల/టౌన్/మిడ్జిల్, జనవరి 22 : అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలు, ము న్సిపాలిటీలో ప్రజలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జడ్చర్లలోని దేవీ థియేటర్లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్ టెలికా స్ట్ చేశారు. జడ్చర్ల మన్సిపాలిటీలోని నేతాజీచౌక్‌లో గణపతి సిండికేట్ ఆధ్వర్యంలో శ్రీరాముని చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజ లు నిర్వహించారు. అదేవిధంగా బూరెడ్డిపల్లిలో హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం నిర్వహించారు. జడ్చర్లలోని సకలదేవతల ఆలయంలో సీతారాముల కల్యానోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. అయోధ్యలో రామమందిరం ప్రా రంభోత్సవం సందర్భంగా జడ్చర్ల ప్రజలకు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపా రు. మిడ్జిల్ మండల కేంద్రంతోపాటు వేము ల, బోయినపల్లి, కొత్తూర్, వల్లభురావుపల్లి, దోనూర్, చిల్వేర్, కొత్తపల్లి తదితర గ్రామాల్లోని పలు ఆలయాల్లో ప్రజలు రా ముడికి ప్రత్యేక పూజలు చేశారు.