Yennam Srinivas Reddy | మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని సింహగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ప్రాంగణంలో నూతనంగా ప్రతిష్టించనున్న శ్రీ గరుత్మంతుడు, శ్రీ ఆంజనేయ స్వామి, సుధాముర్తుల విగ్రహాల కోసం భూమి పూజ నిర్వహించారు. పాలమూరును దుష్టశక్తుల నుంచి సింహగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎల్లవేళలా కాపాడుతూ.. ఈ నగరాన్ని ప్రశాంతంగా ఉంచుతారని ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి, వేద ఆశీర్వాదం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ గరుత్మంతుడు సుదామూర్తుల విగ్రహాలను ఇక్కడ అంగరంగ వైభవంగా ప్రతిష్టించుకోవడం జరుగుతుందన్నారు. మహబూబ్ నగర్ పట్టణం ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉందని.. ఈ ప్రశాంతతను ఇలాగే ఆ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కాపాడుతారని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి సుందరీకరణ కమిటీ అధ్యక్షులు పోల శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు అజ్మత్ అలి, కమిటీ సభ్యులు భాస్కర్, తిరుపతి నాయక్, నర్సింహులు, యం.మల్లేష్, సిహెచ్ కృష్ణయ్య, రాఘవేందర్, కుమారస్వామి, చంద్రమౌళి గుప్త, ఓం ప్రకాష్ బంగర్, మద్దూరి రఘు తదితరులు పాల్గొన్నారు.
Robbery | బైనపల్లి ఆలయంలో చోరీ.. హుండీ ధ్వంసం చేసి నగదు, ఆభరణాలు అపహరణ
మాధవస్వామి గట్టుపై ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల.. గురుకుల పాఠశాలల రాష్ట్ర సెక్రటరీ స్థల పరిశీలన