మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 25 : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మినీట్యాంక్‌బండ్‌పై సంబురాలు అంబరాన్నంటాయి. మూడు రోజులపా టు నిర్వహించనున్న వేడుకలను పర్యాటక, సాంసృ్కతిక శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇకనుంచి ఏటా ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని, త్వరలోనే మరోసారి డ్రోన్ షో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రముఖ గాయకులతో జరగనున్న కార్యక్రమాలకు ప్రజలు భారీగా తరలివచ్చి తిలకించాలని కోరారు. కాగా, సాంస్కృతిక కా ర్యక్రమాలకు విశేష స్పందన లభించింది.
ట్యాంక్‌బండ్ జనంతో కిక్కిరిసిపోయింది. సస్పెషన్ బ్రిడ్జికి అత్యద్భుతంగా లైటింగ్ వేశారు. ట్యాంక్‌బండ్ మధ్య ఏర్పాటు చేసిన స్టేజీపై విజయ, సుమంత్ యాంకరింగ్ చేశారు. ప్రముఖ గాయకురాలు శ్రవ ణ భార్గవి పాడిన పాటలు, డిల్లు బ్రదర్స్ ‘ఏక్ తేరా నామ్ చాచా’ అనే హిందీ పా టకు చేసిన విన్యాసాలు అబ్బురపర్చాయి. దీంతోపాటు ఎల్ఈడీతో చేసిన విన్యాసాలతో సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చిత్రాలను చూపించేలా నృత్యం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహ, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ నర్సింహారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.