మహబూబ్‌నగర్/టౌన్/మెట్టుగడ్డ/అర్బన్ , ఆగస్టు 13 : మహబూబ్‌నగర్ జిల్లా కేం ద్రంలో మినీ ట్యాంక్‌బండ్‌పై ఆదివారం ని ర్వహించిన డ్రోన్ షో ఆకట్టుకున్నది. విలువైన 450 డ్రో న్లతో ప్రదర్శన ప్రారంభమవుతున్న సమయంలో ట్యాంక్‌బండ్ ప్రాంగణమంతా జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై శ్రీ నివాస్‌గౌడ్ నినాదాలతో హోరెత్తింది. ఈ ప్రదర్శనకు ఉమ్మడి జిల్లా విద్యార్థులు, ప్రజలు ప్రత్యేక వాహనాల్లో తరలొచ్చారు.
మాది మహబూబ్‌నగర్ అనే గౌరవంగా చె ప్పుకునేలా జిల్లాను మరింత అభివృద్ధి చే సుకుందామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పెద్ద చెరువు అని ముం దుగా పిలుచుకునే మినీ ట్యాంక్‌బండ్‌పై మ నిషి నడిచేందుకు కూడా వీలు ఉండేది కాద ని, నేడు ట్యాంక్‌బండ్ చుట్టూ రోడ్డుతోపాటు ఐలాండ్, శిల్పారామం, సస్పెషన్ బ్రిడ్జిని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఐటీ టవర్ ఏర్పాటుతో ఎంతోమందికి ఉపాధి లభిస్తుందన్నారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నామని, క్యాన్సర్‌తోపాటు పలు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. సెప్టెంబర్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహించి, అప్పుడే ఆర్డర్ కాపీలు అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మాయమాటలు చెప్పేటోళ్లు వస్తారని, వారిని నమ్మాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్‌కు సమానంగా పాలమూరును అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
సాయంత్రం 7:35 గంటలకు ప్రారంభమైన షో 12 చిత్రాల ప్రదర్శన అనంతరం 7:47గంటలకు ముగిసింది. తెలంగాణ, మహబూబ్‌నగర్ మ్యాప్‌లతో ప్రదర్శన ప్రారంభమైంది. కోహినూర్ వజ్రం, కేసీఆర్ అర్బన్ పార్కు, పిల్లలమర్రి, సస్పెషన్ బ్రిడ్జి, శిల్పారామం, ఐటీ టవర్, జోగుళాంబ ఆలయం, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ముఖ్యమంత్రి కేసీఆర్, జై భారత్, జై తెలంగాణ, మన మహబూబ్‌నగర్ చిత్రాలతో ప్రదర్శన ముగిసింది. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నర్సింహ, పర్యాటక శాఖ ఎండీ మనోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, గొర్రెల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్యయాదవ్, అదనపు కలెక్టర్ మోహన్‌రావు, అదనపు ఎస్పీ రాములు, పర్యాటక శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, నాయకులు రాజేశ్వరి, గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.