నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 12 : ఇది మా నాయకుడి ఇలాకా.. ఇక్కడ మా నాయకుడి అనుమతి లేనిదే చీమ కూడా ఇక్కడ నుండి కదల డానికి వీలు లేదు& మమ్మల్ని కాదని ఎవరైనా తు మ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక తరలిస్తే మీ అంతు చూ స్తాం.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. ఇక్కడ మా నాయకుడు చెప్పిందే వేదం.. ఆయనను కాదని మీరు మొండిగా ప్రవర్తిస్తే మీ టిప్పర్ల టైర్లు కోస్తాం అంటూ జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి అనుచరులు ఇసుక రీచ్‌లు పొందిన టెండర్‌దారులను భయభ్రాంతులకు గురి చేసినట్లు తెలిసింది.. దీంతో వారు విధిలేని పరిస్థితిలో ఇసుక సరఫరాను నిలిపి వేశారు. అధికార పార్టీ నాయకుల తీరు వల్ల గృహ వినియోగదారులకు ఇసుక అందక అవస్థలు పడుతున్నారు.
అధికార పార్టీ నాయకుల బెదిరింపుల విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. వారు టెండర్ దక్కించుకున్న వారికి ఎటువంటి సహాయం చేయకపోవడంతో గత మూడు రోజులుగా ఇసుక రవాణా నిలిచిపోయింది.
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తుమ్మిళ దగ్గర ప్రభుత్వం ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేసింది. తుమ్మిళ్ల రీచ్ దగ్గర నుంచి ఇసుకను తరలించే క్రమంలో అధికార పార్టీ నాయకులు ఇసుకను తరలించకుండా టిప్పర్లను అడ్డుకోవడం.. జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన గుత్తేదారుడికి టీజీ టీఎండీసీ, ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా చేయడానికి టెండర్ దక్కించుకున్నారు. అయితే అది అలంపూర్‌కు చెందిన అధికార పార్టీ నేతకు రుచించడం లేదు. ఎందుకంటే టెండర్ ఆంధ్రప్రాంతం వారికి దక్కక ముందు ఇసుక మాఫియా అంతా ఆ అధికార పార్టీ నేత కనుసన్నల్లోనే నడిచింది. అప్పుడు జిల్లా అంతటా ఆయన అనుచరులే ఇసుక సరఫరా చేసేవారు.
ఆ నేతకు ఇటు జిల్లా అధికారులతోపాటు అటు మైనింగ్ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించడంతో ఆయన అనుచరుల వ్యాపారం ఎటువంటి అడ్డంకులు లేకుండా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగింది. ఇక జిల్లాలో ఇసుక మాఫీయా సామ్రాజ్యానికి ఆయనే రారాజుగా వెలుగొందారు. ఎవరైనా ఇతరులు ఇసుక రీచ్‌ల నుంచి తరలించాంటే అధికారుల అనుమతి అవసరం లేదు, కానీ ఆ నేత అనుమతి తప్పని సరి. ఒకే వేళ ఆ నేత అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే వాహన దారులను ఇబ్బందులకు గురి చేయడం, పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని వేధింపులకు గురి చేయడమే కాకుండా వాహనాలను సీజ్ చేయిస్తున్నట్లు సమాచారం. ఇదంతా ఒక ఎత్తైతే.. గత ఆగస్టు నెలలో ప్రభుత్వం ఇసుక రీచులకు టెండర్ వేసిన సమయంలో రాజమండ్రికి చెందిన కాంట్రాక్టర్‌కు టీఎండీసీతోపాటు ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక తరలించడానికి టెండర్ దక్కించుకున్నారు. అక్కడే అసలు పంచాయితీ ఇక్కడ మొదలైంది.
అప్పటి వరకు అలంపూర్‌కు చెందిన అధికార పార్టీ నేత కనుసన్నల్లో జరిగిన ఇసుక వ్యాపారం ఇప్పుడు టెండర్ దారుడి చేతుల్లోకి వెళ్లి పోవడంతో సదరు నేత ఆదాయానికి గండి పడినైట్లెంది. ఈ గండిని ఎలాగైనా పూడ్చుకోవాలనే ఆలోచనతో ఆ నేత తన అనుచరుల ద్వారా ఇసుక వాహనాలను నడవకుండా చేశాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇసుక సరఫరా నిలిపివేస్తే కాంట్రాక్టర్, సదరు నేత దగ్గరకు వచ్చి షటిల్ మెంట్ చేసుకుంటాడనే ఆలోచనతో ఇలా తను అనుచరులతో ఇసుక వాహనాలు నడవకుండా అడ్డుకుంటున్నట్లు తెలుస్తుంది. అధికార పార్టీకి చెందిన కొంత మంది చోటా నాయకులు మా నాయకుడితో మాట్లాడిన తర్వాతే మీరు ఇసుక కొట్టాలి లేని పక్షంలో టిప్పర్ కదిలిందా టైర్లు కోసేస్తామని ఇసుక టెండర్ పొందిన నిర్వాహకులను హెచ్చరించడం ఇది మరింత బలాన్ని చేకూర్చుతుంది.
కమీషన్ల కోసమే ఇదంతా చేస్తున్నట్లు అధికార పార్టీ నేతలపై బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక రీచ్ టెండర్ పొందిన కాంట్రాక్టర్‌ను భయభ్రాంతులకు గురిచేయడంతో, ఈ విషయం టెండర్ పొందిన కాంట్రాక్టర్ జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు సమాచారం. అధికారులు కూడా టెండర్ పొందిన కాంట్రాక్టర్‌కు సహకరించకుండా అధికార పార్టీ నేతకు సహకరించడంతో కాంట్రాక్టర్‌కు ఏం చేయాలో తోచక ఇసుక సరఫరాను నిలిపివేసినట్లు తెలిసింది. దీంతో గత మూడు రోజులుగా రీచ్ నుంచి ఇసుక బయటకు రావడం లేదు. ఇసుక కోసం అనుమతి ఉన్న టిప్పర్లు సుమారు 20 దాకా రీచ్ దగ్గరే ఉండి పోయాయి.
ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోండి ఇక్కడికి వచ్చి తాము మూడు రోజులు అయింది టిప్పర్లు ఇసుక నింపక పోవడంతో మేము తిండి లేక పస్తులతో ఉంటున్నామని టిప్పర్ డ్రైవర్లు వాపోతున్నారు. గృహ నిర్మాణాలకు, ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత లేకుండా చూస్తామని ఓ వైపు ప్రభుత్వం, జిల్లా అధికారులు చెబుతుంటే అధికార పార్టీ నేతలే ఇసుక సరఫరాను అడ్డుకుంటే ఎవరికి చెప్పుకోవాలో లబ్ధిదారులకు తెలియడం లేదు. ప్రభుత్వం, అధికారులు మాటల్లో చెప్పడం ఒకటి చేతల్లో చేస్తున్నది ఒకటని ఇందిరమ్మ లబ్ధిదారులు వాపోతున్నారు. తమ స్వలాభం కోసం అధికార పార్టీ నేతలే ప్రభుత్వ వ్యతిరేఖ చర్యలకు పూనుకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నగా మారింది.
తెలంగాణ ముఖ్యమంత్రి, గృహ నిర్మాణశాఖ మంత్రి ఫొటోలు పెట్టుకుని అన్ని అనుమతులతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక తరలించే టిప్పర్లను అధికార పార్టీ నాయకులే అడ్డుకోవడం విడ్డూరం. కేవలం కమీషన్ల కోసం కక్కుర్తిపడే ఇలా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పైన ఉండే నా యకులు పట్టించుకోకపోవడం వారి మధ్య ఉన్న సఖ్యతను చాటుతుంది. ఉచితంగా ఇస్తున్నాం అం టూనే కాసులు గుంజుతూ ఇందిరమ్మ లబ్ధిదారుల కళ్లల్లో ఇసుక కొడుతున్నారు.
– అడివప్ప,తుమ్మిళ్ల
జిల్లా అధికారులు స్పం దించి ఇసుక ఇబ్బందులు లేకుండా చూడాలి.అన్ని అనుమతులతో వెళ్తున్న టిప్పర్లను ఎందు కు అడ్డుకుంటున్నారు. కాం గ్రెస్ నాయకులు పబ్లిక్ మీటింగ్‌లో చెప్పేది ఒకటి లోలోపల చేసేది మరోకటి. ప్రజలను మభ్య పె డుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇప్పటికైనా స్థానిక కాంగ్రెస్ నాయకుల అరాచకాలను అడ్డుకొని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇబ్బందులను తొలగించాలి.
– గజేంద్ర, తుమ్మిళ్ల, మాజీ సర్పంచ్