ఊట్కూర్ : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) జోలికి వస్తే అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగేంతవరకు పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హెచ్చరించారు. కేసీఆర్ పై కాంగ్రెస్ కక్షపూరిత ధోరణితో సిట్ నోటీసులు ( SIT Notice) ఇచ్చి విచారణకు ఆదేశించిందని మండిపడ్డారు.
ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ర్యాలీ నిర్వహించి చెక్‌పోస్టు ప్రధాన రహదారిపై కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలను, బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రజా సంక్షేమాలను ప్రజలకు వివరించేందుకు ఫ్లకార్డులు ప్రదర్శించారు.
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు అరవింద్ కుమార్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కోరం శివరాజ్ రెడ్డి, యువజన అధ్యక్షుడు చింతన్ పల్లి ఆనంద్ రెడ్డి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టడం ముమ్మాటికి రాజకీయ కక్షగా పేర్కొన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ ఒబేదుర్ రహిమాన్, తరుణ్ రెడ్డి, గంగాధర్ చారి, కావలి సురేష్, అభిలాష్ రెడ్డి, షేక్ షమీ, బాల్ రామ్, మోట్కార్ రామ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఆంజనేయులు, అశోక్, తిమ్మయ్య, హోటల్ ఖాలిక్ పాల్గొన్నారు.