అమరచింత : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో తన శక్తి మేరకు అభివృద్ధి పనులు చేపడతారని ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. శనివారం అమరచింత పట్టణంలోని ఏడో వార్డులో రెండు లక్షల ఎంపీ నిధులతో చేపట్టిన ఎల్ఈడి వీది లైట్లను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో అరుణ మాట్లాడుతూ.. పార్లమెంటు సమావేశాల కారణంగా నియోజకవర్గంలో పర్యటించేందుకు చాలా సమయం తక్కువగా ఉందని పార్లమెంటు సమావేశాలు అనంతరం మహబూబ్నగర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో గ్రామస్థాయిలో కార్యకర్తలు ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి అభివృద్ధి పనులకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తానని వెల్లడించారు.
అనంతరం ఆత్మకూరు మండలంలోని ఇప్పేంపల్లి గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. అక్కడి నుంచి బిజెపి మండల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అలాగే ఆత్మకూరు మండలంలోని మూలమల్ల గ్రామంలో గత రెండు రోజుల నుంచి జరుగుతున్న పాండురంగ స్వామి పౌర్ణమి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు సత్యప్రసాద్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షురాలు పద్మజా రెడ్డి ఆత్మకూర్ అమరచింత బిజెపి మండలాల అధ్యక్షులు మంగ లావణ్య. అశోక్ భూపాల్. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి. అమరచింత ఆత్మకూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు వారి పల్లి ఉషారాణి. అశ్విని కుమార్. నాగేశ్వర్ రెడ్డి. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి మేరువరాజు. అమరచింత బిజెపి అధ్యక్షుడు క్యామ భాస్కర్. ఆత్మకూరు బిజెపి అధ్యక్షుడు బోరెల్లి రాము. బిజెపి సీనియర్ నాయకులు నరాల నారాయణ. సిద్ధ రాములు. శ్రీనివాస్ యాదవ్. వెంకటేశ్వర్లు. పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.