నారాయణపేట టౌన్, నవంబర్ 23 : పాల ఉత్పత్తుల నుంచి అధిక లాభాలు పొందొచ్చని హైదరాబాద్ విజయ డెయిరీ సొసైటీ రిజిస్ట్రార్ మనోజ్ తెలిపారు. మం డలంలోని పేరపళ్లలో బుధవారం పాడి రై తులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గ్రామాల్లో పాడి రైతులు సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి సంఘంలో 21 మంది సభ్యులు ఉండాల ని, ప్రభుత్వం నుంచి సంఘం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మహబూబ్‌నగర్ విజయ డె యిరీ ఉపసంచాలకురాలు కవిత మాట్లాడుతూ సంఘాల నుంచి పాల సేకరణ చేపట్టి మహబూబ్‌నగర్‌లోని విజయ డెయిరీకి తరలించాలన్నారు.
పాడి రైతులకు పశువులు కొనుగోలు చేసేందుకు సొసైటీల నుంచి రుణాలు ఇప్పిస్తామన్నారు. పా లు విక్రయించడం వల్ల వచ్చే డబ్బులను ప్రతి 15 రోజులకు ఒకసారి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, రుణాలు తీసుకుంటే సగం డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు ఆమె చె ప్పారు. జిల్లాలో మొదటి సారిగా సొసైటీల నుంచి పాల ఉత్పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు. అనంతరం పశువైద్య శిబిరం నిర్వహిం చి పశువులకు టీకాలు వేశారు. మందులను పం పిణీ చేశారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి అనిరుధ్ఆచారి, డీవీహెచ్‌వో శ్రీనివాస్, విజయ డె యిరీ మేనేజర్ ప్రాణేశ్, బీకేఎస్ రాష్ట్ర జోనల్ కా ర్యదర్శి వెంకోబా, పళ్ల బురుజు, పేరపళ్లతండా, కొత్తపల్లితండా, శేర్నపల్లి, సింగారం, జాజాపూర్ గ్రామాలకు చెందిన పాడి రైతులు పాల్గొన్నారు.