ఆత్మకూర్ : ఆత్మకూరు పట్టణంలోని గ్రామ దేవతల ఆలయాల పునర్నిర్మాణంలో భాగంగా ముదిరాజ్ సంఘం ( Mudiraj Sangam) ఆధ్వర్యంలో ముదిరాజ్లు భారీ విరాళానాన్ని (Huge donation) అందజేశారు. ఈ మేరకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్న ముదిరాజ్లు పెద్దమ్మ తల్లి ( Peddamma Talli ) ఆలయ నిర్మాణంతో పాటు గ్రామదేవతల ఆలయాల పునర్నిర్మాణానికి మూడు లక్షల ఒక వంద 16 రూపాయల విరాళానాన్ని పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మొగిలి శ్రీధర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎస్టీడీ శ్రీనివాసుకు అందజేశారు.
ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అశ్విని కుమార్ మాట్లాడుతూ పట్టణంలో నిర్మిస్తున్న పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణంతో పాటు గ్రామదేవతల ఆలయాల పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరిని భాగ్యస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ముదిరాజ్లు విరాళాలలను అందజేశారని తెలిపారు ముదిరాజ్ సంఘం సభ్యుడు తెలుగు సీతయ్య ఆలయ నిర్మాణానికి తనవంతుగా 101 సంచుల సిమెంటును , పరుశురాములు రూ. 10వేలను ప్రత్యేకంగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మణి వర్ధన్ రెడ్డి, నాగేష్, ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.