తిమ్మాజిపేట, ఏప్రిల్ 20 : తిమ్మాజీపేట మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో ఒక ఇల్లు దగ్ధమైంది. స్థానికుల వివరాలు మేరకు.. మండల కేంద్రానికి చెందిన ఫిరోజ్ ఖాన్ ఇంట్లో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించగా అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే బయటికి రావడంతో ప్రమాదం తప్పింది.
అయితే మంటలు ఇంట్లో వ్యాపించడంతో, ఫర్నిచర్, ఇతర వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. మంటలను ఆర్పేందుకు కుటుంబ సభ్యులు విఫల ప్రయత్నం చేశారు. కొంత భాగం ఇంటి గోడను తొలగించి మంటలను ఆర్పారు. అయితే అప్పటికే చాలా వస్తువులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఫిరోజ్ ఖాన్ తో పాటు అంజద్ ఖాన్ కు చెందిన దాదాపు 80 వేల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.